ఆర్.ఆర్.ఆర్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ తో సినిమా చేస్తాడని తెలిసిందే. ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని మరోసారి కన్ ఫర్మ్ చేశాడు జక్కన్న. ట్రిపుల్ ఆర్ సినిమా పూర్తి కాగానే కొద్దిపాటి గ్యాప్ తో ఈ సినిమా స్టార్త్ చేస్తారట. అయితే సినిమా జానర్, బడ్జెట్ విషయాలపై ఓ క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలాఉంటే లాక్ డౌన్ టైం లో రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ గురించి కాకుండా చేయబోయే మహేష్ సినిమా కథ మొదలుపెట్టాడని తెలుస్తుంది. విజయేంద్ర ప్రసాద్ కు లైన్ చెప్పడం.. ఇద్దరు డిస్కషన్స్ చేయడం మొదలుపెట్టారట.

 

మహేష్ తో రాజమౌళి చేసే సినిమాపై ఇప్పటికే అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. రాజమౌళి, మహేష్ ఈ కాంబో కోసం ఎన్నాళ్ల నుండో తెలుగు ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. కె.ఎస్ నారాయణన్ నిర్మించబోయే ఈ సినిమా కూడా పాన్ ఇండియా మూవీగా వస్తుందని తెలుస్తుంది. కేవలం తెలుగు సినిమాలతోనే మహేష్ స్టామినా బాలీవుడ్ వరకు తెలిసింది. ఇక రాజమౌళితో చేసే సినిమా కచ్చితంగా రికార్డులు తిరగ రాస్తుంది.

 

ప్రస్తుతం మహేష్ బాబు పరశురాం డైరక్షన్ లో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే రాజమౌళి సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఒకవేళ జక్కన్న సినిమా మధ్యలో గ్యాప్ వస్తే మాత్రం త్రివిక్రం తో ఓ సినిమా చేయాలని అనుకుంటున్నాడు మహేష్. మొత్తానికి మహేష్, రాజమౌళి సినిమాపై అప్డేట్స్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను ఉత్సాహపరుస్తున్నాయి. అయితే మహేష్ తో జేంస్ బాండ్ తరహాలో రాజమౌళి సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఆర్.ఆర్.ఆర్ తర్వాత సినిమా కాబట్టి ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి.                           

మరింత సమాచారం తెలుసుకోండి: