ఇప్పటికే మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ టాలీవుడ్ లో బడా నిర్మాతగా కొనసాగుతుండగా చిరు రీ ఎంట్రీ టైంలో కొణిదెల ప్రొడక్షన్ అని రాం చరణ్ ఓ కొత్త నిర్మాణ సంస్థ స్థాపించాడు. ఖైది నంబర్ 150, సైరా సినిమాలు రెండు ఆ బ్యానర్ లోనే వచ్చాయి. ఇక లేటెస్ట్ గా మెగా డాటర్ సుస్మిత తన బర్త విష్ణు ప్రసాద్ తో కలిసి ఓ సొంత బ్యానర్ స్టార్ట్ చేశారు. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ అంటూ ఓ సొంత ప్రొడక్షన్ మొదలుపెట్టారు. ఇది కేవ్లం వెబ్ సీరీస్ ల కోసం ఏర్పాటు చేసిన నిర్మాణ సంస్థ అని తెలుస్తుంది.

 

ఇక ఈ ప్రొడక్షన్ హౌజ్ లో మొదటి వెబ్ సీరీస్ ఆనంద్ రంగ డైరక్షన్ లో వస్తుందట. లాక్ డౌన్ కు ముందు కథా చర్చలు జరుగగా.. ఈ గ్యాప్ లో ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేశారట. త్వరలోనే ఈ వెబ్ సీరీస్ మొదలవుతుందని తెలుస్తుంది. ఈ వెబ్ సీరీస్ తెలుగు, తమిళ భాషల్లో వస్తుందట. ఈమధ్య వెబ్ సీరీస్ లు కూడా అన్ని భాషల్లో అందుబాటు ఉండేలా చేస్తున్నారు. ఫ్యామిలీ మెన్ సీరీస్ అన్ని భాషల్లో డబ్ చేసి అందుబాటులో ఉంచారు.

 

అలానే గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సుస్మిత, విష్ణు ప్రసాద్ నిర్మిస్తున్న ఈ వెబ్ సీరీస్ కూడా అన్ని భాషల్లో అందుబాటులో ఉంటుందని తెలుస్తుంది. ఇంతకీ ఈ వెబ్ సీరీస్ కాస్ట్ అండ్ క్రూ ఎవరు.. సుస్మిత ఓన్ ప్రొడక్షన్ పై మెగాస్టార్ కామెంట్ ఏంటి.. ఈమధ్య కాస్టూం డిజైనర్ గా బిజీ అయిన సుస్మిత ఇలా సొంత ప్రొడక్షన్ పెట్టాలనే ఆలోచన ఎందుకొచ్చింది అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది.         

మరింత సమాచారం తెలుసుకోండి: