ఆర్.ఎక్స్.100 సినిమాతో రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ టాలీవుడ్ లో బాగా పాపులరిటీని సాధించింది. అన్ని ఎమోషన్స్ ని స్క్రీన్ మీద అద్భుతంగా పండించింది. లిప్ లాక్స్ సిన్స్ లో ఆహా అనిపించింది. ఆ తర్వాత టాలీవుడ్ లో బోలెడన్ని అవకాశాలు వచ్చాయి. కాని అవన్ని పాయల్ కి నచ్చక నో చెప్పింది. మళ్ళీ ఆర్.ఎక్స్.100 సినిమా కాకుండా కొత్తగా ట్రై చేయాలనుకుంది. అయితే పాయల్ అనుకున్నట్టుగా అవకాశాలు దక్కలేదు. అందుకు కారణం యంగ్ హీరోలకి అంతగా సూటవదు అన్న టాక్ రావడమే.

  

అయితే 2019 లో వెంకీ మామ సినిమా లో వెంకటేష్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది పాయల్. ఈ సినిమా తో హిట్ అందుకుంది. ఆ తర్వాత సీనియర్ హీరోలకి పాయల్ మంచి కాంబినేషన్ అన్న టాక్ రావడంతో రవితేజ సరసన డిస్కో రాజా లో అవకాశం వచ్చింది. సినిమా హిట్ అయితే పాయల్ జర్నీ వేరేలా ఉండేదేమో. కాని డిస్కో రాజా అనుకున్నట్టుగా సక్సస్ ని సాధించలేకపోయింది. దాంతో పాయల్ కి మళ్ళీ ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా ఛాన్స్ రాలేదు. ఈ మధ్యలో బాలకృష్ణ సినిమాలో నటిస్తుందన్న వార్తలు వచ్చాయి. అలాగే అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్పలో ఐటం సాంగ్ చేయబోతుందని అన్నారు. కాని అవన్ని కేవలం గాసిప్స్ అని తేలిపోయింది.

 

అయితే ఇటీవల తనకి అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తో కలిసి పనిచేయాలన్న కోరిక ఉందంటూ తెలిపింది. ఆయన తెరకెక్కించిన అర్జున్ రెడ్డి, బాలీవుడ్ కబీర్ సింగ్ పాయల్ కి బాగా ఇష్టమని వెల్లడించింది. అంతేకాదు అవకాశం వస్తే ఈ దర్శకుడితో కలిసి పనిచేయాలని ఉందట. అయితే పాయల్ ఇలా అనుకోవడం వెనక ఒక బలమైన కారణం ఉందని అంటున్నారు.

 

ఒకే కథ ని రెండు భాషల్లో తీసి బ్లాక్ బస్టర్స్ సాధించాడు సందీప్. దాంతో పాయల్ కి గనక సందీప్ అవకాశం ఇస్తే తెలుగు హిందీ భాషల్లో తెరకెక్కే సినిమాలో నటించే అవకాశం దక్కుతుందన్న ఆలోచనే అని అంటున్నారు. అంటే బాలీవుడ్ లో ఎంట్రీ కోసం ఇలా ప్రయత్నాలు మొదలు పెట్టిందని అర్థం..అని చెప్పుకుంటున్నారు. మరి నిజంగా ఆ అవకాశం వస్తే పాయల్ బాలీవుడ్ లోను సత్తా చాటుతుందేమో చూడాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: