యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో 2003లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా సింహాద్రి. అంతకముందు వారిద్దరి కలయికలో వచ్చిన తొలి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ సూపర్ హిట్ కొట్టడం జరిగింది. ఇకపోతే ఆ తరువాత మంచి అంచనాల మధ్య రిలీజ్ అయిన సింహాద్రి సినిమా ఊహించని రేంజ్ లో సూపర్ డూపర్ హిట్ ని సొంతం చేసుకుంది. అప్పటివరకు టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఉన్న అత్యధిక 50 డేస్, 100 డేస్, 175 డేస్ రికార్డ్స్ ని బీట్ చేసి సరికొత్త రికార్డ్స్ ని సింహాద్రి సినిమా నెలకొల్పడం జరిగింది. 

IHG'

ఒక పెద్దాయన వద్ద నమ్మిన బంటుగా పనిచేస్తున్న సింహాద్రి, ఆపై అనుకోకుండా కేరళ వెళ్లి అక్కడ సింగమలై గా ఎలా మారాడు అనే కథాంశాన్ని తీసుకుని మంచి ఎమోషనల్ గా యాక్షన్ ప్యాక్డ్ స్టోరీ గా దర్శకుడు రాజమౌళి ఈ సినిమాని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఎన్టీఆర్ సరసన అంకిత, భూమిక హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాని విజయమారుతి క్రియేటివ్స్ వారు నిర్మించడం జరిగింది. ఇకపోతే అప్పట్లో ఈ సినిమా 50 డేస్ ని 167 కేంద్రాల్లో, 100 డేస్ ని 150 కేంద్రాల్లో, అలానే 175 డేస్ ని 52 కేంద్రాల్లో జరుపుకోగా, ఆ రికార్డ్స్ ని ఇప్పటికీ కూడా ఎవరూ టచ్ చేయలేపోయారు. ఎన్టీఆర్ అద్భుత నటన, రాజమౌళి అత్యద్భుత టేకింగ్ తో పాటు హీరోయిన్లు ఇద్దరి అంధ చందాలు, అలానే ముఖ్యంగా సంగీత దర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి అందించిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్,

 

యాక్షన్ సీన్స్ వంటివి ఈ సినిమా విజయంలో కీలకపాత్ర వహించాయి. 
ఇకపోతే ఈ సినిమాలో కీరవాణి కంపోజ్ చేసిన సాంగ్స్ అన్ని బాగుంటాయి, అయితే మరీ ముఖ్యంగా నువ్వు విజిలేస్తే ఆంధ్రా సోడాబుడ్డి సాంగ్ ఇప్పటికీ కూడా ఎక్కడో ఒకచోట వినిపిస్తూ ఉంటుంది అంటే, ఆ సాంగ్ అప్పట్లో ఎంత పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసిందో అర్ధం చేసుకోవచ్చు. కాగా నేటితో ఈ సినిమా రిలీజ్ అయి 17 ఏళ్ళు గడవడంతో పలువురు ఎన్టీఆర్ ఫ్యాన్స్, దీనిని ఒక ట్రెండ్ గా చేసి సోషల్ మీడియా మాధ్యమాల్లో పరిగెత్తించారు. కాగా ఎన్టీఆర్, రాజమౌళి ల కాంబోలో ఆతరువాత వచ్చిన యమదొంగ కూడా సూపర్ హిట్ కొట్టగా, ప్రస్తుతం చాలా గ్యాప్ తరువాత వారు ఇద్దరూ కలిసి ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే....!!

మరింత సమాచారం తెలుసుకోండి: