టాలీవుడ్ కి ముందుగా మాస్ మహారాజ రవితేజ హీరోగా వచ్చిన షాక్ సినిమాకు దర్శకుడిగా పరిచయమైన హరీష్ శంకర్, ఆ సినిమా ఘోర పరాజయంతో రెండవ సినిమాకు కొంత విరామం తీసుకున్నాడు. అనంతరం కొన్నేళ్ల తరువాత మరొక్కసారి రవితేజ హీరోగా ఈసారి పక్కాగా కమర్షియల్ సినిమా మిరపకాయ్ తీసి ప్రేక్షకుల ముందుకు వచ్చిన హరీష్, ఆ సినిమాతో సూపర్ హిట్ సొంతం చేసుకున్నాడు. అనంతరం వెంటనే అతడికి తన ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ కు దర్శకత్వం వహించే అవకాశం రావడం, అనూహ్యంగా ఆ సినిమాని ఎంతో గొప్ప విజయవంతంగా హరీష్ తెరకెక్కించడం జరిగింది. ఇక ఇప్పటికీ కూడా ఆ సినిమాని పవన్ ఫ్యాన్స్ మరిచిపోలేరు అంటే హరీష్ ఆ సినిమాను ఎంత బాగా తీశారో అర్ధం చేసుకోవచ్చు. 

IHG's next with <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=MAHESH' target='_blank' title='mahesh- గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>mahesh</a> Babu?

అయితే ఆ తరువాత ఎన్టీఆర్ తో తీసిన రామయ్య వస్తావయ్యా తో భారీ డిజాస్టర్ ని చవిచూసిన హరీష్, ఆపై సుబ్రహ్మణ్యం ఫర్ సెల్ తో హిట్, అలానే బన్నీ తో తీసిన డీజేతో యావరేజ్ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇటీవల వరుణ్ తేజ్ తో తీసిన గద్ధలకొండ గణేష్ తో మంచి హిట్ సొంతం చేసుకున్న హరీష్, అతి త్వరలో మరొక్కసారి పవన్ కళ్యాణ్ తో సినిమా చేయనున్నారు. అయితే దానితో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం కూడా ఒక పవర్ఫుల్ స్టోరీ ని రెడీ చేస్తున్న హరీష్, అన్ని కుదిరితే పవన్ సినిమా తరువాత దానిని పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ సినిమాపై మరోవైపు సూపర్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 

 

హీరోని ఊరమాస్ స్టైల్ లో మంచి కమర్షియల్ యాంగిల్ లో చూపించి వారి ఇమేజ్ ని అమాంతం పెంచేయడంలో దిట్టైన హరీష్ తో, తమ హీరో మహేష్ ఒక సినిమా చేయాలని ఆయన ఫ్యాన్స్ కూడా ఎప్పటినుండో కోరుకుంటున్నారు. అయితే ఆ సినిమా మాత్రం అలా ఇలా కాకుండా అద్భుతం, అమోఘం, అద్వితీయం అనే రేంజ్ లో ఉండాలని, బాబు ల్యాండ్ అయితే అపోజీషన్ కి బ్యాండ్ అయ్యే విధంగా హరీష్ ఆ సినిమాని తీయాలని వారు ఆశపడుతున్నారు. మరి రాబోయే రోజుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు హరీష్ ల కాంబోలో తెరకెక్కనున్న సినిమా ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.....!!   

 

మరింత సమాచారం తెలుసుకోండి: