కథానాయకుడిగా, సహాయ నటుడిగా హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్నమైన పాత్రల్లో నటించగల సామర్థ్యం కలిగిన చంద్రమోహన్ రెండు ఫిలిం ఫేర్ అవార్డులను ఏడు నంది అవార్డులను గెలుచుకున్నాడు. శ్రీదేవి హీరోయిన్ గా నటించిన పదహారేళ్ళ వయసు సినిమా లో అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకుల మనసుల్ని ఫిదా చేసిన చంద్రమోహన్ ఆ తర్వాత హాస్య నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించారు. కాస్త వయసు పైబడిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవతారమెత్తి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు.


హీరో హీరోయిన్లకు తండ్రి పాత్రలలో ఎక్కువగా నటించిన చంద్రమోహన్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. 1999వ సంవత్సరంలో విడుదలైన రావోయి చందమామ సినిమాలో ఫిమేల్ లీడ్ గా నటించిన అంజలా జవేరి కి తండ్రి పాత్రలో నటించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు చంద్రమోహన్. 2000వ సంవత్సరంలో విడుదలైన మనోహరం సినిమాలో హీరోయిన్ లయ తండ్రి పాత్రలో నటించాడు చంద్రమోహన్. ఈ సినిమా లో అతడు పోషించిన తండ్రి పాత్ర కి అశేషమైన గుర్తింపు లభించింది. అక్కినేని నాగార్జున హీరోగా నటించిన మన్మధుడు సినిమాలో హీరోయిన్ కి తండ్రి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను బాగా ఫిదా చేశాడు.


మహేష్ బాబు సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన ఒక్కడు సినిమాలో మహేష్ బాబు ప్రియురాలు అయిన స్వప్న రెడ్డి పాత్రలో హీరోయిన్ భూమిక చావ్లా నటించగా ఆమెకు తండ్రి పాత్రలో చంద్రమోహన్ నటించాడు. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి గుర్తింపు లభించగా చంద్రమోహన్ కి కూడా ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. 2012 వ సంవత్సరంలో విడుదలైన సారొచ్చారు సినిమాలో కాజల్ అగర్వాల్ కి తండ్రి పాత్రలో చంద్రమోహన్ నటించిన ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాడు. ఏడు పదుల వయసు దాటిన తర్వాత కూడా సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను బాగా అలరించిన నటులలో చంద్రమోహన్ ఒకరని చెప్పుకోవచ్చు. ఒకవేళ తనకు 50-60 సంవత్సరాలు ఉన్నట్లయితే దర్శక నిర్మాతలు అందరూ ఇప్పటి హీరోయిన్లుకు అతడిని తండ్రిగా ఎంపిక చేసుకునే వారేమో.


Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: