టాలీవుడ్ సీనియర్ నటుడు రావుగోపాలరావు కి కుమారుడు అయిన రావు రమేష్ తెలుగు సినిమాలలో అరంగేట్రం చేసి తన తండ్రి తెలుగు సినీ అభిమానులను ఎంత గా అలరించారో తాను కూడా అదే తరహాలో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు. 2002వ సంవత్సరంలో సీమ సింహం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన రావు రమేష్ 2008వ సంవత్సరంలో వచ్చిన కొత్త బంగారు లోకం లో ఒక లెక్చరర్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. 2009వ సంవత్సరంలో వచ్చిన మగధీర సినిమా లో ఘోర పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. ఖలేజా సినిమాలో తాంత్రిక్ పాత్రలో కూడా నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. ఈ విధంగా విభిన్నమైన విలక్షణమైన పాత్రలో నటించిన రావు రమేష్ తర్వాత హీరోయిన్లకు తండ్రి పాత్రలో నటించడం ప్రారంభించాడు.


2013వ సంవత్సరంలో విడుదలైన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సమంతకి తండ్రి పాత్రలో నటించాడు రావు రమేష్. అచ్చం నిజమైన తండ్రిలా అతడు చూపించిన నటనా చాతుర్యం ప్రేక్షకులను బాగా మెప్పించింది. వాడిని ఎవరికైనా చూపించండి రా... వదిలేయకండి రా వాడిని అలాగా అని రావు రమేష్ చెప్పిన డైలాగులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సమంత తండ్రిగా రావు రమేష్ కరెక్ట్ గా సరిపోయాడు అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. సినిమా చూపిస్త మామ మూవీలో కత్తిగా రాజ్ తరుణ్, పరినీతా ఛాటర్జీగా అవికా గోర్ పరినీతా తండ్రి సొమనాధ్ ఛాటర్జీగా రావు రమేశ్ నటించారు.


అయితే అవికాగోర్ కి తండ్రిగా రావు రమేష్ తన నటనా చాతుర్యంతో దుమ్మురేపాడు అని చెప్పుకోవచ్చు. దేనికైనా పద్ధతి ఉండాలి అని పద్ధతులు శ్రద్ధగా పాటించే తన కూతురు కూడా పద్ధతిగా ఉండాలి అనుకునే తండ్రి పాత్రలో రావు రమేష్ జీవించేశాడని అని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ఏ పాత్రలో అయినా ఒదిగి పోగల నటనా ప్రతిభ రావురమేష్ లో ఉందని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: