తెలుగు కుటుంబంలో జన్మించిన మురళి శర్మ ఐదు భాషలైన తెలుగు, తమిళం, మరాఠీ, గుజరాతీ, హిందీ భాషలలో అనర్గళంగా మాట్లాడగలడు. అతడు ఎక్కువగా హిందీ, తెలుగు సినిమాల్లో నటిస్తున్నాడు. దూరదర్శన్ లో వచ్చే ధారావాహికలో కూడా కీలకమైన పాత్రలో నటించి బాగా పేరొందాడు మురళి శర్మ. తెలుగు సినీ రంగ ప్రవేశం చేసి 2002 నుంచి 2007 వరకు హిందీ సినిమాల్లో నటించాడు. ఆ తర్వాత మహేష్ బాబు హీరోగా నటించిన అతిథి సినిమాలో విలన్ పాత్రలో నటించి నంది అవార్డు కూడా గెలుచుకున్నాడు.


మళ్లీ హిందీ సినిమాలకే పరిమితమైన మురళి శర్మ చట్టం, అధినాయకుడు, మిస్టర్ నూకయ్య వంటి తెలుగు చిత్రాలలో నటించాడు. తదనంతరం అడపాదడపా తెలుగు సినిమాల్లో నటించాడు కానీ అతని క్యారెక్టర్ కి అంతగా గుర్తింపు లభించలేదు. 2016వ సంవత్సరంలో మీలో ఎవరు కోటీశ్వరుడు సినిమా లో హీరోయిన్ గా నటించిన శృతి సోది కి తండ్రి పాత్రలో నటించి బాగా మెప్పించాడు మురళీశర్మ. అయితే హీరో నాని నటించిన నిన్ను కోరి సినిమా లో హీరోయిన్ పాత్రలో నటించిన నివేదాథామస్ కి తండ్రి పాత్రలో నటించాడు మురళి శర్మ. ఈ పాత్ర ప్రేక్షకుల మనసులో నువ్వు చూడకూడదని చెప్పుకోవచ్చు. హీరోయిన్ కి తండ్రిగా చాలా చక్కగా మురళి శర్మ నటించాడని చెప్పుకోవచ్చు.


2018 లో పదమూడు తెలుగు సినిమాల్లో నటించి తనకి నటుడిగా ఎంత డిమాండ్ ఉందో చెప్పకనే చెప్పేశాడు. శర్వానంద్ సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన పడి పడి లేచే మనసు సినిమాలో మురళి శర్మా హీరోయిన్ పాత్రకి తండ్రి గా నటించాడు. 2015 వ సంవత్సరంలో విడుదలైన భలే భలే మగాడివోయ్ సినిమాలో హీరో నాని సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. అయితే హీరోయిన్ కి తండ్రి పాత్రలో పాండురంగారావు గా నటించిన మురళి శర్మ పాత్ర కి తెలుగు ప్రేక్షకులందరూ ఫిదా అయిపోయారు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: