టాలీవుడ్ ఇండస్ట్రీ లో క్యారక్టర్ ఆర్టిస్ట్ లకు మంచి పేరు ఉందన్న విషయం తెలిసిందే.. అందుకే సినిమాలో నటించే హీరో, హీరోయిన్ల కన్నా కూడా క్యారక్టర్ ఆర్టిస్టులు ఎక్కువ పాపులర్ అవుతున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో అలా నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నటీ నటులు ఎందరో ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే తండ్రి పాత్ర లో నటించి మెప్పించిన ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు.. స్టార్ హీరో,  హీరోయిన్లకు తండ్రిగా చాలా మంది నటిస్తున్నారు. 

 

 

వారిలో ముఖ్యంగా వినపడే పేరు నాజర్.. తెలుగు సినిమాల లో ఈయన పేరుకు కూడా చాలా ప్రత్యేకత ఉంది.. విభిన్న పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. తండ్రిగా ఈయన చేసిన సినిమాలు కూడా మంచి హిట్ ని అందుకున్నాయి.. ఇటీవల ఈయన నటించిన బాహుబలి ప్రపంచ స్థాయి రికార్డులను అందుకుంది.. నటన లో ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ వరుస సినిమాల లో నటిస్తున్నారు.

 

 

గతంలో ఈయన నటించిన సూపర్ హిట్ చిత్రం కొంచెం ఇష్టం .. కొంచెం కష్టం.. ఆయా సినిమాలో అయన హీరోయిన్ తమన్నా తండ్రిగా నటించాడు. కూతురు ఎవరిని ప్రేమించింది అనగానే తన ఇష్టాన్నిఅర్థం చేసుకున్నా కూడా పెళ్లి చేయకుండా హీరో వాళ్ళ అమ్మా, నాన్నలు కలిస్తేనే పెళ్లి జరుగుతుందని షరతు పెట్టాడు.. దాంతో హీరో సిద్దార్థ్ విడిపోయిన వారి అమ్మా నాన్నను కలపటానికి శత విధాలా ప్రయత్నిస్తాడు. ఆ సందర్బాల్లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు సినిమా అభిమానులను కంటతడి పెట్టించాయి. అలా నాజర్ పెట్టిన శరత్ ను విజవంతంగా పూర్తి చేసి నాజర్ మనసును గెలుచుకుంటాడు. ఆ సినిమాలో కూతురిని ప్రేమించే తండ్రి పాత్రలో నటించిన నాజర్ నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం క్యారక్టర్ ఆర్టిస్టుగా వరుస సినిమాలలో నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: