ఇటీవల హరీష్ శంకర్ తో ఇంకెప్పుడు సినిమాలు తీయనని ప్రకటించిన నటుడు, నిర్మాత బండ్ల గణేష్  ఇప్పుడు మనసు మార్చుకున్నాడు. అంత పెద్ద డైరెక్టర్ అవకాశం ఇస్తే ఎందుకు తీయను అంటూ తాజాగా బండ్ల వ్యాఖ్యానించాడు. వీరిద్దరి మధ్య  గత కొంత కాలంగా వార్ నడించింది. నా వల్లే పవన్ కళ్యాణ్ ను డైరక్ట్ చేసే అవకాశం హరీష్ కు వచ్చింది. అతనికి రీమేక్ సినిమాలు తప్ప సొంత కథతో సినిమా తీసి హిట్ కొట్టడం చాతకాదంటూ బండ్ల గణేష్ వివాదాస్పద వ్యాఖ్యలు  చేశాడు అయితే దీనికి హరీష్ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.
 
ఏమైందో ఏమో కానీ బండ్లలో సడన్ గా భారీ మార్పు వచ్చింది. గత కొద్దీ రోజుల నుండి ట్విట్టర్ లో యాక్టీవ్ గా వుంటూ అందరిగురించి పాజిటివ్ గానే స్పందిస్తున్నాడు. ఇక తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూ లో హరీష్ శంకర్ తో వివాదం గురించి స్పందిస్తూ..హరీష్ నా తమ్ముడు లాంటి వాడు ఇగో వల్ల చిన్న చిన్న మనస్పర్థలు వచ్చాయి కానీ ఇప్పుడు అతని పై ఎలాంటి కోపం లేదు అంత పెద్ద డైరెక్టర్ అవకాశం ఇస్తే మరో సినిమా చేస్తానని గణేష్ అన్నాడు. గణేష్ వ్యాఖ్యలపై హరీష్ శంకర్ కూడా స్పందించాడు. బండ్ల గణేష్ అంటే నాకు ఎప్పుడు గౌరవమే.. గబ్బర్ సింగే కాదు మిరపకాయ్ ముందే నాతో సినిమా చేయడానికి గణేష్ రెడీ  గావున్నాడు. కరోనా నుండి అతను కోలుకున్నందుకు సంతోషం అని హరీష్ ట్వీట్ చేశాడు. ఈట్వీట్ ను బండ్ల గణేష్ రీ ట్వీట్ చేశాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: