టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెకటర్ పూరి జగన్నాథ్ తీసిన “ఇస్మార్ట్ శంకర్” సినిమాతో ఎనర్జిటిక్ స్టార్ రామ్ కి అదిరిపోయో హిట్ పడింది. ఎప్పటి నుంచో ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న రామ్ కి ఈ సినిమా మంచి కం బ్యాక్ మూవీ అయింది. అంతే కాదు అంతకముందు ఒకటొ రెండు మాస్ సినిమాలు చేసిన రాని మాస్ హీరో ఇమేజ్ ఇస్మార్ట్ శంకర్ తో వచ్చింది.  దీంతో రామ్ దర్శకుడు కిషోర్ తిరుమల తో “రెడ్” టైటిల్ తో మరో మాస్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ తో మాస్ ఆడియన్స్ లో మరోసారి మంచి క్రేజ్ వచ్చేసింది. 

 

IHG

ఇక ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉండగా లాక్ డౌన్ తో ఆగిపోయింది. సక్సస్ ట్రాక్ ని కంటిన్యూ చేయాలనుకున్న రామ్ ప్లాన్స్ అన్నిటికి బ్రేక్ పడింది. ఇక ఈ సినిమాలో రామ్ సరసన హీరోయిన్ గా మాళవిక శర్మ నటించింది. ఈ బ్యూటీ కూడా ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకుంది. తమిళ సూపర్ హిట్ సినిమా తడం కి రీమేక్ గా రూపొందిన ఈ సినిమాని రామ్ పెదనాన్న స్రవంతి రవికిషోర్ నిర్మించారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతమందించాడు. 

 

IHG

అయితే మాళవిక శర్మ 19 ఏళ్ళకే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మాస్ మహారాజా రవితేజ నటించిన నేల టికెట్ తో తెలుగు తెరకి పరిచయమైన ఈ బ్యూటీ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవుతుందనుకుంది. రాజా ది గ్రేట్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చిన ఈ సినిమా మీద రవితేజ కూడా చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు. కాని ఆ నమ్మకాలన్ని ఒక్క బొమ్మ పడగానే అలా గాలిలో కలిసిపోయాయి. 

 

IHG

దాంతో చూడటానికి అద్భుతంగా ఉన్నా..మేకర్స్ అందరినీ అట్రాక్ట్ చేసిన జనాలకి నచ్చినా మాళవిక శర్మ టాలీవుడ్ లో సక్సస్ కాలేకపోయింది. ఒకవేళ నేల టికెట్ హిట్ అయి ఉంటే మాళవిక కి మరికొన్ని సినిమాలలో అవకాశాలు వచ్చేవేమో. కాని సినిమా ఫ్లాప్ కావడంతో మరుగున పడిపోయింది. మధ్యలో ఒకటి రెండు సినిమాలలో అవకాశం వచ్చినట్టే వచ్చి జారిపోయింది. మరి మాళవిక కి రవితేజ ఇవ్వని సక్సస్ రామ్ ఇస్తాడేమో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: