టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటించిన సినిమా 'జెర్సీ'. ఈ సినిమాలో నాని కి జంటగా శ్రద్ధా శ్రీనాథ్‌ నటించింది. kashmir - SRINAGAR/JAMMU' target='_blank' title='జమ్మూ అండ్ కాశ్మీర్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>జమ్మూ అండ్ కాశ్మీర్ లో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ మోడల్ గా ఆ తర్వాత సినిమా రంగం లో అడుగు పెట్టింది. కోహినూర్ అనే మళయాళ సినిమాతో అడుగు పెట్టిన శ్రద్ధా శ్రీనాథ్ ఆ తర్వాత కన్నడ సినిమా యూ టర్న్ లో నటించింది. వరసగా కన్నడ, తమిళ సినిమాలలో నటించి పాపులార్టీని సాధిస్తూ జెర్సీ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది.

 

IHG

సెన్సిటివ్ లవ్ స్టోరీ తో ఈ సినిమా తెరకెక్కించాడు గౌతమ్ తిన్ననూరి. క్రికెట్ బ్యాక్ డ్రాప్‌లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో సమస్యలను, ఇబ్బందులను ఈ సినిమాలో అద్భుతంగా చూపించాడు. ఎమోషనల్ గా సాగిన కథ కథనాలతో  జెర్సీ ప్రేక్షకుల్నీ కట్టిపడేసిందని చెప్పాలి. ఇక సినిమాలో నాని, శ్రద్ధా శ్రీనాథ్‌ల నటనకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. అంతేకాదు చిత్ర యూనిట్ మొత్తానికి సినీ ప్రముఖుల నుంచి గొప్ప ప్రశంసలు దక్కాయి.

 

IHG

అయితే ఈ సినిమా తర్వాత శ్రద్ధా శ్రీనాథ్ టాలీవుడ్ లో యంగ్ హీరోల సరసన వరసగా సినిమాలు చేస్తుందని అనుకున్నారు. కాని ఎందుకనో శ్రద్ధా శ్రీనాథ్ కి క్రేజీ ప్రాజెక్ట్స్ లో అవకాశాలు రాలేదు. ఇక ఇదే సినిమాని బాలీవుడ్ లో నిర్మించబోతున్నారు. అక్కడ కూడా శ్రద్ధా శ్రీనాథ్ ని హీరోయిన్ గా అనుకుంటున్నట్టు ప్రచారం జరిగింది. కాని ఇప్పటి వరకు అధికారకంగా మాత్రం వెల్లడి కాలేదు. 

 

IHG

అయితే అందుకు కారణం శ్రద్ధా శ్రీనాథ్ జెర్సీ లో చాలా పద్దతిగా నటించడం అని అంటున్నారు. ఒక బిడ్డకి తల్లిగా నటించడం కూడా మైనస్ అయిందన్న టాక్ వచ్చింది. కాని రీసెంట్ గా రిలీజైన క్రిష్ణ అండ్‌ హీస్‌ లీల సినిమాలో మాత్రం శ్రద్ధా శ్రీనాథ్ రెచ్చిపోయింది. హాట్ సీన్స్ అండ్ బెడ్రూం సీన్స్ లో చూసిన ప్రతీ ఒక్కరు శ్రద్ధా శ్రీనాథ్ ని ఇలా ఎలా మిస్ అయ్యామని అనుకుంటున్నారట. అంతేకాదు శ్రద్ధా శ్రీనాథ్ కూడా ఇప్పటి నుంచి యూ టర్న్ తీసుకొని గ్లామర్ రోల్స్ చేయడానికి రెడీ అవుతుందట. కథ నచ్చితే మాత్రం ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్దమని తగ్గేది లేదని అంటుందని నెటిజన్ చెప్పుకుంటున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: