తమిళనాడులోని ఓ చిన్న మారుమూల ప్రాంతంలో జన్మించిన సాయి పల్లవి డాక్టర్ చదువు పూర్తి చేసింది కానీ నటన పై తనకున్న ఆసక్తితో సినిమా రంగం వైపు అడుగులు వేసింది. 2005, 2008 సంవత్సరాల్లో చిన్న పాత్రల్లో నటించిన సాయి పల్లవి 2015 వ సంవత్సరంలో మలయాళం సినిమా ప్రేమం లో మలార్ పాత్రని పోషించి బాగా పాపులారిటీ సంపాదించుకుంది. 2016వ సంవత్సరంలో దుల్కర్ సల్మాన్ సరసన ఈ సినిమాలో నటించిన సాయి పల్లవికి మంచి పేరు దక్కింది. ఈ రెండు మలయాళ సినిమాల్లో నటించిన తర్వాత ఆమె తెలుగులో అరంగేట్రం చేసి వరుణ్ తేజ్ సరసన ఫిదా సినిమాలో నటించి యావత్ తెలుగు రాష్ట్రాల ప్రజలను ఎంతగానో ఎంటర్టైన్ చేసింది.


భానుమతి పాత్రలో నటించిన ఈమె తన అందచందాలతో అభినయంతో మధురమైన గొంతుతో ప్రేక్షకులను వెండితెరకు కట్టిపడేసింది. వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే పాటలో సాయి పల్లవి చేసిన డాన్స్ ని ప్రతి ఒక్కరూ తెగ పొగిడేశారు. ఈ ఒక్క సినిమాతో తెలుగులో ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఫిదా సినిమా టీవీ లో ఐదు సార్లు ప్రసారం చేస్తే... ప్రతిసారి బడా హీరోల సరికొత్త సినిమాకు వచ్చిన రేటింగ్ వచ్చిందంటే అతిశయోక్తి కాదు. ఇందుకు కారణం భానుమతి క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు.


2018 సంవత్సరంలో దియా మూవీ ద్వారా తమిళ సినీ పరిశ్రమలో అడుగు పెట్టింది. సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన కొన్ని సంవత్సరాలకి బాగా పాపులారిటీ తెచ్చుకున్న సాయి పల్లవి కణం, పడి పడి లేచే మనసు, మిడిల్ క్లాస్ అబ్బాయి మారి 2 వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించి తన పాపులారిటీని ఇంకా పెంచేసుకుంది. అచ్చం తెలుగింటి అమ్మాయిలా కనిపించే సాయి పల్లవి ప్రస్తుతం రానా దగ్గుబాటి హీరోగా నటిస్తున్న విరాటపర్వం సినిమాలో కథానాయికగా నటిస్తోంది. అలాగే చైతన్య లవ్ స్టోరీ సినిమాలో కూడా నటిస్తోంది.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: