26 ఏళ్ల బెంగాళీ నటి పై కొంతమంది దుండగులు అత్యాచారం జరిపారు. బిజోయ్ ఘర్ ప్రాంతంలో బుధవారం ఈ ఘటన జరిగింది. ఈ మేరకు నటి జాదవ్‌పూర్ పోలీస్ స్టేషన్ ‌లో జూలై 8 కంప్లయింట్‌ నమోదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. బాధిత నటి సాత్‌ బాయ్‌ చంపా అనే టెలివిజన్‌ సీరియల్ ‌లో నటిస్తున్న లీడ్‌ యాక్ట్రస్ ‌గా అని తెలుస్తోంది.

 

ఈ నెల 5 తారీఖున కొంత మంది దుండగులు నటి నివస్తున్న ఫ్లాట్‌కు వచ్చి ఆర్థిక సాయం చేయాలంటూ కోరారు. ఆ సమయంలో నటి ఒంటరి గా ఉన్న విషయాన్ని గమనించిన సదరు వ్యక్తులు, అదే అదునుగా ఆమె మీద అత్యాచారానికి తెగ బడ్డారు. పోలీసులకు ఇచ్చిన స్టేట్‌ మెంట్‌ లో తాను ఆ ఫ్లాట్‌ లో కొంత కాలంగా ఒంటరి గానే ఉంటున్నట్టుగా పేర్కొంది.

 

ఆగంతకులు తన రేప్ చేయటం మాత్రమే కాదు. ఆ ఘటనను వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరించారని చెప్పింది . అయితే ఆ బెదిరింపులకు లొంగని నటి పోలీసులను ఆశ్రయించింది. ఇచ్చిన కంప్లయింట్ మేరకు నిందితుల పై ఇండియన్ పీనల్‌ కోర్ట్‌ సెక్షన్‌ 306/506 కేసు నమోదు చేసినట్టుగా వెల్లడించారు.

 

ప్రాథమిక విచారణ లో నిందితుడు నటికి పరిచయస్తుడే అని తేలినట్టుగా పోలీసులు వెల్లడించారు. నింధితుడు బిజినెస్‌ మేన్‌ అని అతడు నటి తో గతంలో సన్నిహితంగా ఉండేవాడని, కానీ కొన్ని కారణాల తో వారిద్దరు విడిగా ఉంటున్నారని తెలిపారు. ప్రస్తుతం విచారణ జరుగుతోందని, కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో నే వెల్లడిస్తామని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: