బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న క్రేజీ మూవీ RRR. ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి చేస్తున్న ఈ క్రేజీ మల్టీస్టారర్ సినిమా ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. రియల్ ఫ్రీడం ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు, కొమరం భీం పాత్రలో రాం చరణ్, ఎన్.టి.ఆర్ లు కనిపిస్తారని తెలుస్తుంది. లాక్ డౌన్ తర్వాత త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా 2021 జనవరి 8న రిలీజ్ కూడా వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తుంది.

 

సినిమా గురించి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో షూటింగ్ కష్టం కాబట్టి ఆర్.ఆర్.ఆర్ ను కూడా రెండు పార్టుగా రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారట. బాహుబలి సినిమాను కూడా ముందు ఒక పార్ట్ గా తీయాలని అనుకున్నారు కాని తీస్తున్నా కొద్ది ఎక్కువవడం వల్ల బాహుబలి బిగినింగ్, బాహుబలి కన్ క్లూజన్ రెండు పార్టులుగా ర్లీజ్ చేశారు. 

 

ఇక ఇప్పుడు rrr సినిమాకు కూడా అదే ఫార్ముల ఫాలో అయ్యే ఛాన్సులు ఉన్నట్టు తెలుస్తుంది. సినిమా ఇప్పటివరకు 70 శాతం వరకు షూటింగ్ పూర్తి కాగా ట్రిపుల్ ఆర్ ని కూడా రెండు పార్టులుగా రిలీజ్ చేసేలా ప్లాన్ చేసి ఇప్పటివరకు జరిగిన షూటింగ్ తో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తే బాగానే ఉంటుందని  చిత్రయూనిట్ భావిస్తున్నారట. రాజమౌళి ఆలోచనల్లో rrr రెండు పార్టులు చేయాలని ఉందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్, అలియా భట్ కూడా నటిస్తున్నారు. సినిమాలో రాం చరణ్ కు జోదీగా అలియా భట్, తారక్ కు జతగా ఒలివియా మోరిస్ నటిస్తున్నారని తెలిసిందే                 

మరింత సమాచారం తెలుసుకోండి: