బాహుబలి ఫ్రాంఛైజీ తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాతో ప్రభాస్ కి హాలీవుడ్ స్టార్ రేంజ్ లో క్రేజ్ వచ్చింది. ఇక టాలీవుడ్ హీరోలలోనే పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ని సాధించిన మొదటి హీరో ప్రభాస్ గొప్ప విషయం. 

 

IHG

ఇక ప్రభాస్ బాహుబలి చిత్రీకరణలో ఉండగానే సాహో సినిమాని ప్రకటించాడు. ఒకే ఒక్క సినిమా అనుభవం ఉన్న యంగ్ డైరెక్టర్ కి సాహో లాంటి భారీ బడ్జట్ సినిమా ఇవ్వడం ఇండస్ట్రీలో పెద్ద సంచలనం అయింది. అయితే బాహుబలి కన్‌క్లూజన్ రిలీజ్ రోజు సాహో టీజర్ ని థియోటర్స్ లో రిలీజ్ చేసి తన సత్త ఏంటో జస్ట్ సాంపిల్ చూపించాడు సుజీత్. ప్రభాస్ కోసం రెండేళ్ళకి పైగా వేయిట్ చేసిన సుకీత్ సినిమాని హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించాడు. తెలుగు హిందీ భాషలతో పాటు మిగతా భాషల్లోను భారీ స్థాయిలో  రిలీజ్ చేశారు. మేకింగ్ పరంగా సూపర్ అన్న టాక్ వచ్చినప్పటికి ఒక్క బాలీవుడ్ లో తప్ప మిగతా అన్ని భాషల్లో నిరాశను మిగిల్చింది.

 

IHG

ఇక ఈ సినిమా తర్వాత యంగ్ డైరెక్టర్ రాధ కృష్ణ కుమార్ తో తన 20 వ సినిమాని మొదలు పెట్టాడు. ఈ డైరెక్టర్ కి ఇది రెండవ సినిమా కావడం ఆశ్చర్యకరం. ఇక ఈ సినిమాని గోపీ కృష్ణ మూవీస్ బ్యానర్ లో ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణం రాజు సమర్పిస్తుండగా యువి క్రియోషన్స్ లో వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో స‌త్య‌రాజ్‌, భాగ్య‌శ్రీ, కునాల్ రాయ్ క‌పూర్‌, జ‌గ‌ప‌తిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

 

IHG

ఇక ఇప్పటికే ఈ సినిమా విదేశాలలో 70 శాతం చిత్రీకరణ పూర్తయిన ఈ సినిమా నుండి ప్రభాస్ లుక్ ని రిలీజ్ చేయమని ఫ్యాన్స్ ఒత్తిడి చేశారు. దాంతో ఎట్టకేలకి తాజాగా ఈ సినిమా టైటిల్ రాధే శ్యామ్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసి పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చారు ప్రభాస్ టీం. అయితే ఇంత ఆలస్యం  అవడానికి కారణం ముందుగా ప్రభాస్ సోలో పోస్టర్ ని కొన్ని సెకన్ల పాటు ఉండే మోషన్ పోస్టర్ లా రిలీజ్ చేయాలనుకున్నారని సమాచారం.

 

IHG

అయితే అప్పటికీ టైటిల్ విషయంలో కొంత సందిగ్ధత నెలకొనడంతో చిత్ర బృందం ఎలాంటి పోస్టర్ రిలీజ్ చేస్తే ప్రభాస్ అభిమానులలో ప్రేక్షకులలో బజ్ క్రియోటవుతుంది అని ఆలోచించి కథ ఏంటో చిన్న హింట్ ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో రొమాంటిక్ గా ఉండేల రాధే శ్యామ్ ఫస్ట్ లుక్ డిజైన్ చేశారట. అది కూడా చిత్రం బృందం ఈ లుక్ మీద పూర్తి నమ్మకం కలిగాక రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది.

 

IHG

ఇక ఈ సినిమా టైటిల్ ని నాలుగు భాషల్లో రిలీజ్ చేశారు. ఇక ప్రభాస్ రాధే శ్యామ్ టైటిల్ ఫస్ట్ లుక్ లో కొన్ని క్లూస్ కూడా ఇచ్చాడు. పోస్టర్ లో రొమాంటిక్ లవ్ స్టోరీ అని హింట్ ఇచ్చాడు. అంతేకాదు ప్రభాస్ పూజా హెగ్డే లుక్ తో పాటు బ్యాగ్రౌండ్ లో కనిపిస్తున్న రెడ్ కలర్ ట్రాజడీ లవ్ స్టోరీ అన్న మరో హింట్ అని తెలుస్తుంది. ముఖ్యంగా ప్ర‌భాస్‌, పూజా ఇద్ద‌రూ ప్రేమ‌కి ప్ర‌తిరూపంగా వుండ‌టం.. ఎర్ర‌టి స‌ముద్రాన్ని గౌనుగా వాడ‌టంలో ద‌ర్శ‌కుడి క్రియెటివిటి క‌నిపిస్తుంది. ప్రేమ‌ని చూపిస్తూ దాని వెన‌క ఉన్న స‌మ‌స్య‌ ఉందంటూ ఇచ్చిన హింట్ విశ్లేషకులని మెప్పించింది. మొత్తానికి యంగ్ డైరెక్టర్ క్రియోటివిటీ అద్భుతంగా ఉందని చెప్పుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: