తెలుగు సినిమాను శాసించిన మణిశర్మ మెలోడీ బీట్స్ కు పెట్టింది పేరు. మాస్ బీట్స్ తో పాటు క్లాసిక్స్ కూడా ఆయన ఖాతాలో ఉన్నాయి. చిరంజీవితో 1998లో ‘బావగారూ.. బాగున్నారా’ సూపర్ సక్సెస్ అందుకున్నాడు. అదే ఏడాది ‘చూడాలని ఉంది’కి మరో అవకాశం అందుకున్నాడు మణిశర్మ. ఈ సినిమాకు ఇచ్చిన మ్యూజిక్ తో ఓవర్ నైట్ టాప్ టెక్నీషియన్ అయిపోయాడు. 2002లో మహేశ్ ఒక్కడు వచ్చే వరకూ ఇండస్ట్రీలో మణిశర్మకు ఉన్న పేరు చూడాలని ఉంది మ్యూజిక్ డైరక్టర్ అనే. చూడాలని ఉందితో మణిశర్మ సృష్టించిన ప్రభంజనం అది. ఇదొక ఘనతగా చెప్పాల్సిందే.

IHG

 

ఆంటీ కూతురా.. అని బావగారూ బాగున్నారాలో మాస్ బీట్ ఇచ్చినా.. స్వప్న వేణువేదో.. అని రావోయి చందమామలో క్లాస్ బీట్ ఇచ్చిన అది మణిశర్మలోని ప్రత్యేకమైన టాలెంటే. మనోహరంలో ప్రతి పాటను తన అద్భుతమైన సంగీతంలో మలిచాడు. రీసెంట్ గా ఇస్మార్ట్ శంకర్ తో తనలోని మాస్ బీట్స్ పవరేంటో చూపించాడు. హీరో బాడీ లాంగ్వేజ్ నుబట్టి రచయితలు కథలు రాస్తారు.. దర్శకులు సినిమా తీస్తారు. కానీ అదే హీరో బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టు సంగీతం ఇస్తాడు మణిశర్మ. ఇది ఆయనలోని ప్రత్యేక టాలెంట్. ఇంత బిజీగా మారిన తర్వాత కూడా మణిశర్మ తన ఆధ్యాత్మికతను వదులుకోలేదు.

IHG

 

మ్యూజిక్ డైరక్టర్ గా కెరీర్ ప్రారంభించిన తర్వాత మణిశర్మ వరుసగా 108 నెలలు తిరుమల వెళ్లాడు మణిశర్మ. ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. చేసిన ప్రతి సినిమాకు వైవిధ్యం చూపిస్తూ తన హయాంలో తెలుగు సినిమా సంగీతాన్ని పరుగులెత్తించాడు. దాదాపు ప్రతి స్టార్ హీరోతో కూడా సినిమాలు చేసి నెంబర్ వన్ మ్యూజిషియన్ గా మారాడు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ సినిమాకు వర్క్ చేస్తున్నాడు.

IHG

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: