‘బాహుబలి’ బిగినింగ్ విడుదలై 5 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా నిన్న విడుదలైన ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘రాథే శ్యామ్’ ఫస్ట్ లుక్ పై మిశ్రమస్పందన రావడం కొంతవరకు ఈమూవీ మేకర్స్ కు షాక్ ఇచ్చే విషయం. ‘సాహో’ ఘోర పరాజయం తరువాత ప్రభాస్ అభిమానులు ఈమూవీ ఫస్ట్ లుక్ గురించి అదేవిధంగా ఈమూవీలో ప్రభాస్ లుక్ గురించి ఎన్నో కలలు కన్నారు. 


వాస్తవానికి ఈమూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేయడంలో ఆలస్యం జరిగినందుకు ప్రభాస్ అభిమానులు తీవ్రఅసహనానికి లోనవ్వడమే కాకుండా ఈమూవీ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ను టార్గెట్ చేస్తూ కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడ గతంలో పెట్టారు. ఏది ఎలా ఉన్నా నిన్న విడుదలైన ఈమూవీ ఫస్ట్ లుక్ లో రాధ గా పూజా హెగ్డే శ్యామ్ గా ప్రభాస్ లు కనిపిస్తూ ఒక క్యూట్ లవ్ స్టోరీలో నటిస్తున్నట్లుగా ఈ ఫస్ట్ లుక్ ద్వారా సంకేతాలు ఇచ్చారు.


అయితే పాన్ ఇండియా మూవీగా ప్రమోట్ చేయబడుతున్న ఈమూవీ స్థాయికి తగ్గట్టుగా ఈఫస్ట్ లుక్ లేదని అప్పుడే నెగిటివ్ కామెంట్స్ మొదలైపోయాయి. ఈఫస్ట్ లుక్ బ్యాక్ గ్రౌండ్ లో రెడ్ అండ్ ఆరెంజ్ రంగులు బాగా ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితులలో తమ ప్రేమ విజయవంతం అవ్వడం కోసం రాథా శ్యామ్ లు ఈసినిమాలో చాల సమస్యలు ఎదుర్కుంటారు అన్నభావన అంతర్లీనంగా ఆ కలర్స్ ను బట్టి అర్థం అవుతుంది అంటూ ప్రభాస్ అభిమానులు సరికొత్త అర్ధాలను ఈఫస్ట్ లుక్ పోష్టర్ పై తీస్తున్నారు.


అయితే మరికొందరు మాత్రం ఈ ఫస్ట్ లుక్ పోష్టర్ డిజైన్ ఏమంత ఆకర్షణీయంగా లేదని ‘బాహుబలి’ బిగినింగ్ విడుదలైన రోజును గుర్తుకు చేస్తూ విడుదలచేసిన ‘రాథే శ్యామ్’ ఫస్ట్ లుక్ పోష్టర్ కేవలం ఒక సాదాసీదా సినిమా ఫస్ట్ లుక్ లా ఉంది కాని ఈపోష్టర్ వల్ల ఈమూవీ పై ఏమి అంచనాలు పెరగవు అంటూ మరికొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. దీని తోడు మరికొందరు అయితే  ఈ ఫస్ట్ లుక్  గతం లో విడుదల అయిన   కంచె సినిమాలోని  స్టిల్ కు కాపీ అంటూ నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు . దీనితో ప్రభాస్ అభిమానుల ఉత్సాహం నీరుకారిపోయినా ఆవిషయాలు బయటపెట్టకుండా ఈఫస్ట్ లుక్ పోష్టర్ కు వేలసంఖ్యలో లైక్ లు కొడుతున్నారు.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: