ప్రస్థుతం జనం చూడటానికి సినిమాలు లేకపోవడంతో అందరు టివి షోలకు ఓటీటీ లలో వచ్చే సినిమాలకు విపరీతంగా కనెక్ట్ అయిపోతున్నారు. ఇలాంటి పరిస్థితులలో టెలివిజన్ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా విజయవంతమైన ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 4 షోను వీలైనంత త్వరలో మొదలుపెట్టాలని స్టార్ మా ఇప్పటికే ఈషోలో పాల్గొనబోయే హౌస్ మేట్స్ ఎంపిక పూర్తి చేసింది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈషో ఆగష్టు నుండి ప్రారంభం అవుతుంది అన్న లీకులు వస్తున్నాయి.


ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈషోకి సంబంధించి ఒక భారీ సెట్ నిర్మాణం జరుగుతోంది అన్నవార్తలు వస్తున్నాయి. ఈషోకు హోస్ట్ గా మరొకసారి నాగార్జున ఎంపిక అయినప్పటికీ ఈషో ప్రారంభం కాకుండానే నాగార్జునకు ఈషోను నిర్వహిస్తున్న స్టార్ మా యాజమాన్యం నుండి ఊహించని షాక్ తగిలినట్లు గాసిప్పులు వస్తున్నాయి. వాస్తవానికి ఈషోకు నాగార్జున మరొకసారి హోస్ట్ గా అంగీకరించినప్పుడు నాగ్ తాను గతసంవత్సరం హోస్ట్ చేసిన సీజన్ కంటే ఈసీజన్ 4 షోకు 25 శాతం అదనపు పారితోషికం ఇవ్వాలని మొదటిలోనే కండిషన్ పెట్టినట్లు టాక్.


అయితే అప్పుడు కరోనా వైరస్ ప్రభావం ఇంకా ప్రారంభం కాకపోవడంతో నాగ్ కండిషన్స్ కు స్టార్ మా యాజమాన్యం ఆనందంగా అప్పట్లో ఒప్పుకుంది అని తెలుస్తోంది. అయితే ఇప్పుడు కరోనా పరిస్థితులు ముదిరిపోయి ఇలాంటి పాపులర్ షోలకు వచ్చే ప్రకటనల పై వచ్చే ఆదాయం తగ్గిపోవడంతో స్టార్ మా యాజమాన్యం ఈమధ్య నాగ్ ను కలిసి తాము ఒప్పుకున్నట్లుగా నాగార్జునకు ఈషోకు పారితోషికం పెంచలేమని గత షోకు ఇచ్చిన విధంగా షోకు 12 లక్షలు ఇస్తామని వినయపూర్వకంగా బేరసారాలు ఆడినట్లు టాక్. దీనితో నాగ్ షాక్ అయినప్పటికీ ప్రస్తుతం షూటింగ్ లు ఎలాగు ఇప్పట్లో ప్రారంభం అయ్యే సూచనలు లేవు కాబట్టి ఖాళీగా ఉండేకన్నా ‘బిగ్ బాస్’ షోలో హోస్ట్ గా కనిపిస్తే పేరుకు పేరు డబ్బుకు డబ్బు వస్తుంది అన్న ఆలోచనలతో నాగార్జున ప్రస్తుత పరిస్థితులతో బిగ్ బాస్ తో రాజీపదిపోయాడు అన్న గాసిప్పులు సందడి చేస్తున్నాయి.


ఇది ఇలా ఉంటే ‘బిగ్ బాస్’ సీజన్ 4 ను హోస్ట్ చేసే విషయంలో నాగార్జునకు కొన్ని సందేహాలు వెంటాడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రోజురోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్న స్థితిలో ఈపరిస్థితులను ఎదిరిస్తూ ఒక సెట్ లోకి వెళ్ళి అనేకమంది ఆడియన్స్ మధ్యలో బిగ్ బాస్ షోను హోస్ట్ చేయడం ఎంతవరకు శ్రేయస్కరం అన్నఆలోచనలతో పాటు ఎంతవరకు ఈషోలో పాల్గొనే హౌస్ మేట్స్ ప్రస్తుత పరిఅస్తితులలో టాస్క్ ల విషయంలో భౌతిక దూరం పాటించగలుగుతారు అన్న కన్ఫ్యూజన్ నాగార్జున మనసులో ఉన్నట్లు లీకులు వస్తున్నాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: