ప్రస్తుతం అయోమయంలో పడిపోయిన టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి పునర్వైభవం రావాలి అంటే అది ఒక్క ‘ఆర్ ఆర్ ఆర్’ వలన మాత్రమే సాధ్యం అంటూ ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈమూవీ క్రియేట్ చేసే రికార్డులను బట్టి భవిష్యత్ లో భారీసినిమాల నిర్మాణం ఆధారపడి ఉంటుంది.


ప్రస్తుతం ఈమూవీ షూటింగ్ ను ఏదోవిధంగా కనీసం సెప్టెంబర్ నుండైనా మొదలుపెట్టి ఈమూవీని వచ్చే ఏడాది సమ్మర్ రేసులో నిలబెట్టాలని రాజమౌళి తనకున్న అపారమైన తెలివితేటలను అనుభవాన్ని ఈమూవీ పై పెడుతున్నాడు. ప్రస్తుతం కరోనా పరిస్థితులలో ఈమూవీ బడ్జెట్ విషయంలో కూడ ఆలోచనలలోపడిన రాజమౌళి భారీ సెట్టింగ్స్ వేసే విషయంలో ఈమూవీని తక్కువ ఖర్చుతో సిల్వర్ స్క్రీన్ పై గ్రాండియర్ గా చూపెట్టడానికి ఉన్నమార్గాల గురించి ఇప్పటికే కొంతమంది ప్రముఖ గ్రాఫిక్స్ ఎక్స్ పర్ట్స్ తో చర్చలు జరుపుతున్నాడు అన్నవార్తలు వస్తున్నాయి.


ఇలాంటి పరిస్థితులలో ఈసినిమా మార్కట్ కు సంబంధించి ఒక గాసిప్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తోంది. కరోనా పరిస్థితులు ప్రారంభం కాకముందు ఈమూవీ ఖచ్చితంగా వచ్చేఏడాది సంక్రాంతికి విడుదల అవుతుంది అన్న ఊహలతో చాలామంది ప్రముఖ బయ్యర్లు నిర్మాత దానయ్య ఈమూవీ ఏరియా రేట్స్ ఫైనల్ చేయకుండానే ఈమూవీ పై ఉన్న మోజుతో రాజమౌళి పై ఉన్న నమ్మకంతో భారీ మొత్తాలను దానయ్యకు ఈఏడాది ప్రారంభంలో కొంతమంది బయ్యర్లు ఇచ్చినట్లు టాక్.


అయితే ఇప్పుడు కరోనా పరిస్థితులు ఎప్పటికి కంట్రోల్ అవుతాయో తెలియక దీనికితోడు ‘ఆర్ ఆర్ ఆర్’ ఎప్పుడు విడుదల అవుతుందో క్లారిటీ లేకపోవడంతో ఈభారీ మొత్తాలను ఇచ్చిన బయ్యర్లు దానయ్యను కలిసి తెలివిగా మాట్లాడినట్లు గాసిప్పులు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వ్యాపారాలు సరిగ్గా లేకపోవడంతో తాము డబ్బు విషయంలో చాల టైట్ గా ఉన్నామని అందువల్ల తాము గతంలో ‘ఆర్ ఆర్ అర్’ ఏరియా హక్కుల కోసం అడ్వాన్స్ గా ఇచ్చిన మొత్తాలను తిరిగి ఇచ్చిస్తే మళ్ళీ తాము వచ్చేఏడాది జనవరి ప్రాంతంలో ఇస్తాము అని అంటున్నట్లు టాక్. ఈరాయబారాలకు మైండ్ బ్లాంక్ అయిన దానయ్య బయ్యర్ల తెలివికి తగ్గట్టుగా వారిని నొప్పించకుండా ఎలా సమాధానాలు చెప్పాలి అన్న విషయమై ప్రస్తుతం దానయ్య రాజమౌళి సలహాలు తీసుకుంటున్నట్లు గాసిప్పులు వస్తున్నాయి. వాస్తవానికి ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియకపోయినా హడావిడి చేస్తున్న ఈవార్తలు విని ప్రస్తుతం బయ్యర్లు ‘ఆర్ ఆర్ ఆర్’ లాంటి భారీ సినిమాను కూడ నమ్మడం లేదా అంటూ కొందరు ఆశ్చర్య పడుతున్నారు..    

 

మరింత సమాచారం తెలుసుకోండి: