‘ఇస్మార్ట్ శంకర్’ ఘన విజయంతో యంగ్ హీరో రామ్ కెరియర్ మళ్ళీ గాడిలో పడింది అని అందరు అనుకున్నారు. అయితే ఈఆనందం ఎక్కువరోజులు రామ్ కు నిలబడలేదు. ఈమూవీ ఇచ్చిన జోష్ తో తన కెరియర్ ను మాస్ హీరోగా మరో స్థాయికి తీసుకువెళ్ళాలని రామ్ ‘రెడ్’ మూవీని తనసొంత బ్యానర్ పై నిర్మాణం చేయించి ఈమూవీని గడిచిపోయిన సమ్మర్ లో విడుదల చేసి భారీ కలక్షన్స్ కొట్టాలని మాష్టర్ ప్లాన్ వేసాడు.


క్రైమ్ థ్రిల్లర్ మూవీగా ఇప్పటికే నిర్మాణం పూర్తిచేసుకున్న చాలాబాగా వచ్చిందని ఈమూవీ ఫైనల్ అవుట్ పుట్ చూసిన ఇండస్ట్రీ వర్గాలలో కొందరు చెపుతున్నారు. దీనికితోడు ఈమూవీ కోసం మణిశర్మ అందించిన ట్యూన్స్ చాల అద్భుతంగా ఉన్నాయని ఇప్పటికే ఈమూవీ పాటలను విన్న కొందరు చెపుతున్నారు. ముఖ్యంగా కిషోర్ తిరుమల దర్శకత్వం ఈమూవీకి మరో హైలెట్ అని అంటున్నారు.


ఇన్ని పాజిటివ్ ఫీడ్ బ్యాక్ తో ఈమూవీకి బిజినెస్ ఆఫర్స్ కూడ చాల భారీస్థాయిలో వచ్చాయి. అయితే కరోనా రామ్ ఆశలను తలక్రిందులు చేసింది. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్ లపై విడుదల అవుతున్న అన్ని సినిమాలకు సరైన స్పందన రాకపోవడంతో ఇప్పుడు ప్రముఖ ఓటీటీ సంస్థల దృష్టి అంతా ‘రెడ్’ పై పడిందని వార్తలు వస్తున్నాయి.


తెలుస్తున్న సమాచారం మేరకు ఒకప్రముఖ ఓటీటీ సంస్థ 30 కోట్ల ఆఫర్ ‘రెడ్’ కు ఇచ్చినట్లు టాక్. ఈవార్తలు ఇలా బయటకు వచ్చిన వెంటనే మరో డిజిటల్ ఫ్లాట్ ఫామ్ సంస్థ 35 కోట్ల ఆఫర్ ను ‘రెడ్’ నిర్మాతలకు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనితో ఈమూవీ నిర్మాతలు వస్తున్న ఆఫర్లలో ఎదోఒకటి ఫైనల్ చేయాలని ఈమూవీ నిర్మాతలు ఆలోచనలు చేస్తూ ఉంటే ఎన్నిరోజులు వెయిట్ చేసైనా ఈమూవీని థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలని రామ్ పట్టుపడుతున్నట్లు టాక్. దీనితో ‘రెడ్’ పై అంత మితిమీరిన నమ్మకం ఈపరిస్థితులలో రామ్  ఏర్పరుచుకోవడం మంచిదికాదు అంటూ దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలి అని సన్నిహితులు సలహాలు ఇస్తున్నట్లు టాక్..

మరింత సమాచారం తెలుసుకోండి: