కరోనా మహమ్మారి కారణంగా నష్టపోయిన వాటిలో సినిమా రంగం కూడా ఒకటి. కరోనా ప్రభావం అన్ని రంగాలపై పడింది. కానీ సినిమా రంగంపై బాగా ప్రభావం చూపిస్తుంది. థియేటర్లు లేక షూటింగులు లేక సినిమా వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజువారి కూలీల పరిస్థితి చాలా దయనీయంగా మారింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం షూటింగులకి అనుమతులు ఇచ్చింది. కానీ కరోనా వల్ల భయపడి చాలా మంది షూటింగులకి వెళ్లట్లేదు.

 

 

ఒకవేళ స్టార్ట్ చేసినా మధ్యలో ఎవరికైనా కరోనా వస్తే ఏంటి పరిస్థితి అన్నది అర్థం కాకుండా ఉంది. అదీ గాకుండా ఆల్రెడీ సీరియల్స్ షూటింగ్స్ స్టార్ట్ చేసినవారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో కనిపిస్తూనే ఉంది. అందువల్ల చిత్రీకరణ మొదలు పెట్టిన తర్వాత మధ్యలో ఆగిపోతే అప్పుడు నిర్మాత చాలా నష్టం వస్తుంది. అందువల్లే ఇంకా షూటింగులు మొదలు కావట్లేదు. అయితే ఇలా నష్టం రాకుండా ఉండడానికి ఇన్స్యూరెన్స్ చేయిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

IHG'I will get married  only when I want to have babies' - <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=BOLLYWOOD' target='_blank' title='bollywood-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>bollywood</a> - Hindustan Times

 

హీరోయిన్ తాప్సీ పన్ను నటించిన లూప్ లపేటా చిత్రానికి కోవిడ్ 19 ఇన్స్యూరెన్స్ చేయిస్తున్నారట. అయితే దీని ప్రకారం షూటింగ్ మధ్యలో ఆగిపోతే ఎన్ని రోజులు ఆగిపోయిందో అన్ని రోజులకి వచ్చిన నష్టాన్ని ఇన్స్యూరెన్స్ కంపెనీ చెల్లించనుందట. అంటే ఒకవేళ కరోనా వచ్చి షూటింగ్ నిలిచిపోయినా నిర్మాతకి ఎలాంటి నష్టం ఉండదన్నమాట. ప్రస్తుతానికి లూప్ లపేటా చిత్ర నిర్మాత దీనికి అప్లై చేసాడట.

 

 

మరి ఇది ఓకే అయ్యి సక్సెస్ అయితే గనక మరింత మంది నిర్మాతలు ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. తాప్సీ లూప్ లపేట్ ఆ చిత్రాన్ని ఆకాష్ భాటియా డైరెక్ట్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: