ఎవరు ఏం చెప్పినా ఐ డోంట్ కేర్.. ఎవరు ఏమన్నా ఐ డోంట్ మైన్.. ఇది సంచలన దర్శకులు రాంగోపావ్ వర్మ చెప్పే మాటలు. నా మనసులో ఉన్న భావాలకు రూపం ఇవ్వడమే నాకు ఇష్టం.. నేను దేనికి భయపడను అంటారు. ఈ మద్య కాలంలో ఆయన వరుసగా బయోపిక్ లే తీస్తున్నారు. తాజాగా రామ్‌ గోపాల్ వర్మ పవర్‌ స్టార్‌ పేరిట ఓ సినిమా తీస్తోన్న విషయం తెలిసిందే.  ఈ సినిమాలో పీకే, ఎమ్మెస్, ఎన్‌బీ, టీఎస్‌, నలుగురు పిల్లలు, ఎనిమిది బర్రెలు, ఆర్జీవీతో పాటు ఓ రష్యన్ మహిళ కూడా ఉంటుందని ఆయన ఇప్పటికే ప్రకటించారు. 

IHG
ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పోస్టర్స్ రిలీజ్ చేస్తూ తెగ హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే.  ఎన్నికల ఫలితాల  తర్వాత కథ ఏంటీన్న కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా పవర్ స్టార్ నుంచి 'పవరొమాంటిక్' పోస్టర్‌ ఇదిగో అంటూ ఆర్జీవీ తన ట్విట్టర్ ఖాతాలో దీన్ని పోస్ట్ చేశారు. ‌ 

IHG

కాగా, 'పవర్ స్టార్' పేరిట తీస్తోన్న ఈ సినిమా లోగోలో వర్మ జనసేన పార్టీ గుర్తు గ్లాసు, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చదివే పుస్తకాలను వాడుతోన్న విషయం తెలిసిందే. వీటిని ఎవరు డిజైన్ చేశారో వర్మ తెలిపారు. 'పవర్ స్టార్ సినిమాలోని ఈ గొప్ప వినూత్నమైన పోస్టర్లను గొప్ప నైపుణ్యాలున్న క్రియేటివ్ సైకో డిజైన్‌ చేశాడు' అని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: