మొన్న విడుదలైన ‘రాధే శ్యామ్’ ఫస్ట్ లుక్ కు విపరీతమైన స్పందన వచ్చినా ఒక్క ప్రభాస్ అభిమానులు తప్ప ఇండస్ట్రీలోని ఏ వర్గం ఆనందంగా లేరు. దీనికికారణం టాప్ హీరోల సినిమాల పై కొనసాగుతున్న అనిస్థితి వాస్తవానికి ప్రభాస్ అభిమానుల నిరాశను తగ్గించడానికి ఈ ఫస్ట్ లుక్ విడుదల చేసారు కాని ఈ మూవీ షూటింగ్ ఈ కరోనా పరిస్థితులు వల్ల మళ్ళీ ఎప్పుడు మొదలవుతుందో ప్రభాస్ కు కూడ తెలియదు.


ఈ సినిమాతో పాటు నిర్మాణం మధ్యలో ఉన్న ‘ఆర్ ఆర్ ఆర్’ ‘ఆచార్య’ ‘వకీల్ సాబ్’ బోయపాటి బాలకృష్ణ ల మూవీల పరిస్థితి కూడ ఇదేవిధంగా ఉంది. దీనితో ఈ మూవీలు అన్నీ మూకమ్మడిగా వచ్చే సంవత్సరం పైనే ఆశలు పెట్టుకున్నాయి. అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే ‘వకీల్ సాబ్’ వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదలైతే వచ్చే ఏడాది సమ్మర్ కు ‘ఆర్ ఆర్ ఆర్’ ‘ఆచార్య’ బోయపాటి బాలకృష్ణల మూవీ ఉంటుందని ఇప్పటికి అంచనాలు వస్తున్నాయి.


అయితే కరోనా పరిస్థితులు ఇప్పటిలో అదుపులోకి రావని వచ్చే సంవత్సరం ఫిబ్రవరి ప్రాంతానికి రోజుకు 2 లక్షల కేసుల నమోదు స్థాయికి భారత్ చేరుకుంటుంది అంటూ ఒక అమెరికన్ సంస్థ ప్రకటించిన అధ్యయనంతో టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ వర్గాలు నీరు కారిపోతున్నాయి. ఊహిస్తున్న ఈ పరిస్థితులు యదార్ధం అయితే వచ్చే ఏడాది సమ్మర్ సీజన్ కూడ గాలిలో కలిసిపోయినట్లే అన్న అభిప్రాయంలో ఇండస్ట్రీ వర్గాలు ఉన్నాయి.


దీనికితోడు ఈ భారీ సినిమాల ఫస్ట్ లుక్స్ కు టీజర్లకు స్పందన అత్యంత భారీగా వస్తున్నా టాప్ హీరోల సినిమాలు కొనే బయ్యర్ల నుండి కనీసపు స్పందన కూడ రాకపోవడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది అని టాక్. ఈ పరిస్థితులలో ఇప్పుడు ఇండస్ట్రీ ఆశలు అన్నీ ఇక రాబోతున్న 2021 పైనే ఉన్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: