గత మూడు నెలల నుంచి లాక్ డౌన్ కొనసాగుతుంది. సినీ పరిశ్రమ లాక్ డౌన్ కారణంగా సినీ పరిశ్రమ షట్ డౌన్ అయిన విషయం తెలిసిందే. ఈ మద్య లాక్ డౌన్ సడలించినప్పటి నుంచి మళ్లీ షూటింగ్ మొదలు పెట్టవొచ్చని చెప్పారు.  కానీ ఈ మద్య కరోనా ఎక్కువ అవుతుందని షూటింగ్స్ ఎక్కడా పెద్దగా మొదలు కాలేదు. అయితే ఇప్పటికే కొన్ని సినిమా షూటింగ్స్ షెడ్యూల్ దాదాపు పూర్తి చేసుకున్న సినిమాలు థియేటర్లు రిలీజ్ కాగానే రిలీజ్ చేయడానికి సిద్దంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీజర్, ట్రైలర్స్ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన కొత్త మూవీ ‘బజరంగీ-2 టీజర్ను విడుదల చేశారు.

 

మూవీ 2013లో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న  ‘బజరంగీ’  చిత్రానికి సీక్వెల్. భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించగా టీజర్కు అద్భుత స్పందన వస్తోంది. సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ తెలుగు, తమిళ, హిందీ ఆడియన్స్ కి బాగా సుపరిచితమే.  తెలుగు లో కన్నడ స్టార్స్ ఈ మద్య బాగా రాణిస్తున్నారు. ఉపేంద్ర, కిచ్చ సుదీప్ వరుసగా తెలుగు సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా శివరాజ్ తెలుగులో డైరెక్ట్ మూవీస్ లో నటించలేదు కానీ.. ఎన్నో డబ్బింగ్ మూవీస్ వచ్చాయి.  తాజాగా శివ రాజ్ కుమార్ నటించిన ‘బజరంగీ-2 ’ టీజర్ రిలీజ్ చేశారు. గతంలో సూపర్ హిట్ అయిన   ‘బజరంగీ’ మూవీకి సీక్వెల్ ఇది.

 

భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించగా టీజర్కు అద్భుత స్పందన వస్తోంది. కన్నడ చిత్రమే అయినా బాలీవుడ్తో సహా దక్షిణాది సినీ ప్రేమికులు సైతం ఈ చిత్ర టీజర్ను ఆన్లైన్లో షేర్ చేస్తూ మెచ్చుకుంటున్నారు. ఈ స్పందనను గమనించిన దర్శక, నిర్మాతలు సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. త్వరలో తెలుగులో కూడా ఈ సినిమాను నిర్మించనున్నారు. జయన్న ఫిలిమ్స్ బ్యానర్ పై జయన్న, భోగేంద్ర నిర్మిస్తున్న ఈ సినిమాను ఎ.హర్ష డైరెక్ట్ చేస్తున్నారు. థియేటర్లు తెరుచుకోగానే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: