సౌత్ క్రేజీ హీరోయిన్స్ లో కాజల్ అగర్వాల్ ఒకరు. లష్మి కళ్యాణం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు చందమామ సినిమాతో సూపర్ పాపులారిటీ తెచ్చుకుంది. ఇక మగధీర సినిమాతో అమ్మడు క్రేజ్ డబుల్ అయ్యింది. తెలుగులో దాదాపు అందరి స్టార్స్ తో నటించిన కాజల్ కేవలం అభినయానికి ప్రాధాన్యత ఇచ్చే పాత్రలే చేస్తూ వచ్చింది. గ్లామర్ షో విషయంలో అటు ఇటుగా ఉండే కాజల్ అడపాదడపా మాత్రమే హాట్ లుక్స్ తో ఆకట్టుకుంటుంది. అందరు హీరోయిన్స్ లా స్కిన్ షో చేయడానికి ఇష్టపడని అమ్మడు అలా చేయకపోయినా సరే ఆఫర్లు రాబట్టుకుంది.

 

ఇక లేటెస్ట్ గా కెరియర్ ముగింపు దశకు చేరుకున్న ఈ టైంలో అమ్మడు గ్లామర్ విషయంలో కూడా గేట్లు ఎత్తేయాలని డిసైడ్ అయ్యింది. శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా ఇండియన్ 2. పాతికేళ్ల క్రితం వచ్చిన ఇండియన్ సినిమాకు సీక్వల్ గా వస్తున్న ఈ సినిమాలో కాజల్ బికిని షో ప్లాన్ చేశాడట డైరక్టర్ శంకర్. ఈ సినిమాలో కాజల్ లోని మరో యాంగిల్ బయటపెడుతుందని తెలుస్తుంది. ఎలాగు ఈమధ్య పెద్దగా అవకాశాలు రావడం లేదు కాబట్టి బికిని షోతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తుంది అమ్మడు. 

 

ఎన్.టి.ఆర్ జనతా గ్యారేజ్ సినిమాలో పక్కా లోకల్ సాంగ్ లో అమ్మడు చేసిన హాట్ షోకే ఆడియెన్స్ ఫిదా అయ్యారు. అలాంటిది కాజల్ టూ పీస్ బికిని వేస్తే మాత్రం ఇక ఆ రచ్చ మాములుగా ఉండదు. కాజల్ చేసే ఈ స్కిన్ షో ఇండియన్ 2 సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటుందని తెలుస్తుంది. మరి కాజల్ అగర్వాల్ కెరియర్ లో ఫస్ట్ టైం ఈ రేంజ్ లో అందాల ప్రదర్శన చేయబోతుందని తెలిసి ఆమె ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషిగా ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: