ప్రభాస్ లేటెస్ట్ సినిమా విషయంలో అతడి ఫ్యాన్స్ చేసిన హంగామా ఈమధ్య కాలంలో ఏ టాప్ హీరో సినిమా టైటిల్ విషయంలో జరగలేదు. ప్రభాస్ సినిమా టైటిల్ అనౌన్స్ చేయడంలో ఆలస్యం అవడంతో అభిమానులు ఆ ఆలస్యానికి తట్టుకోలేక తమకు తామే అప్పటికే ప్రచారంలో ఉన్న  ‘రాధే శ్యామ్’ అనే టైటిల్ ను ఓన్ చేసుకొని దాన్ని ట్రెడింగ్ చేయడమే కాకుండా ఆమూవీ టైటిల్ కు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల కాకుండానే ఆ టైటిల్ కు విపరీతమైన ప్రచారంచేసారు.


దీనితో ఈమూవీ నిర్మాతలు తమ కన్ఫ్యూజన్ పక్కకు పెట్టి చివరికి ప్రచారంలో ఉన్న ‘రాధే శ్యామ్’ టైటిల్ ను అధికారికంగా ప్రకటించవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఈ విషయాన్ని ప్రాతిపదికగా తీసుకుని ప్రభావితం అయి పవన్ ఫ్యాన్స్ రంగంలోకి దిగిపోవడం హాట్ టాపిక్ గా మారింది.


వాస్తవానికి పవన్ క్రిష్ ల సినిమాకు సంబంధించి టైటిల్ విషయమై క్రిష్ ఇప్పటికి ఒక స్థిరనిర్ణయానికి రాలేకపోతున్నాడు. అయితే ఇప్పటికే క్రిష్ ఆలోచనలలోకి వచ్చిన ‘బందిపోటు’ టైటిల్ పై క్రిష్ అందరి అభిప్రాయాలు తెలుసుకుంటున్నాడు. అయితే ఈ టైటిల్ ను అప్పుడే పవన్ అభిమానులు ఓన్ చేసుకుని ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘బందిపోటు’ హ్యాష్ ట్యాగ్ తో విపరీతమైన ప్రచారం చేస్తున్నారు.


అంతేకాదు పవన్ క్రిష్ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఏచిన్న చర్చ జరిగినా దానికి ‘బందిపోటు’ టైటిల్ ను అనుసంధానం చేస్తూ తెగహడావిడి చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమాకు సంబంధించి ‘విరూపాక్ష’ అన్న టైటిల్ ప్రచారంలోకి వచ్చినా ఆ టైటిల్  పవన్ ఫ్యాన్స్ కు పెద్దగా నచ్చక పోవడంతో  ఓమాస్ టైటిల్ కావాలని వాళ్లుపట్టు పడుతున్నారు. ఈపరిస్థితులలో ఇప్పుడు ‘బందిపోటు’ టైటిల్ వార్తలు బయటకు రావడంతో ట్రెండ్ అవుతున్న ఆ టైటిల్ ను ఫిక్స్ చేయవలసిన పరిస్థితి క్రిష్ కు ఏర్పడుతుందా అంటూ కొందరు సందేహాలు వ్యక్తపరుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: