త్వరలో బిగ్ రియాలిటీ షో 'బిగ్ బాస్' సీజన్ 4 మొదలవబోతుంది. ఇప్పటికే ఈ సీజన్ కి సంబంధించి బిగ్ హౌజ్ లో కొన్ని మార్పులు చేస్తున్నారట. గత మూడు సీజన్స్ కంటే ఈ సీజన్ ఇంకా భారీ స్థాయిలో నిర్వహించాలని స్టార్ మా యాజమాన్యం  సన్నాహాలు చేస్తున్నారు. ఇక హిందీతో పాటు తమిళంలోను ఈ రియాలిటీ షో కి ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ కొత్త సీజన్ మొదలవబోతున్న నేపథ్యంలో ఎక్కువగా పార్టిసిపెంట్స్ విషయంలో చాలామంది పేర్లు ప్రచారంలో నిలుస్తున్నాయి.

 

ఇక ఇప్పటి వరకు మొదటి సీజన్ కి హోస్ట్ గా టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ విపరీతమైన క్రేజ్ ని తీసుకు వచ్చాడు. కాని ఆ స్థాయి క్రేజ్ మిగతా రెండు సీజన్స్ కి రాలేదనే చెప్పాలి. దాంతో సీజన్ 4 కి వెంకటేష్.. మహేష్ బాబు లాంటి పేర్లు స్టార్ మా అనుకున్నారట. కాని నాగార్జున తోనే సీజన్ 4 నిర్వహించాలని ఫైనల్ అయినప్పటికి తాజాగా విజయ్ దేవరకొండకి ఆ అవకాశం ఉందంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. 

 

సీజన్ గ్ కి హోస్ట్ గా వ్యవహరించేది ఎవరన్నది తేలనుంది. ఇక త్వరలో మొదలవబోయో సీజన్ 4 లో ఇండస్ట్రీతో పాటు బుల్లితెర మీద సందడి చేస్తున్న కొంతమంది యాంకర్స్ తో పాటు నటులు కూడా పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు యాంకర్ లాస్య పేరు వినిపిస్తుంది. అలాగే ఒక ఫేడవుట్ తెలుగు యంగ్ హీరోయిన్ ని కూడా స్టార్ మా సంప్రదించినట్టు తెలుస్తుంది. యాంకర్ లాస్య కొంతకాలం క్రితం ప్రముఖ ఛానల్ లో రెగ్యులర్ గా షోలు చేసింది.

 

అలాగే ఆడియో ఈవెంట్స్ కి హోస్ట్ గా వ్యవహరించింది. ఇక తెలుగమ్మాయిగా టాలీవుడ్ లో చాలా తక్కువ సినిమాలు చేసిన కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఆమె కూడా ఈ సీజన్ లో పాల్గొనబోతుందట. ఇక సీజన్ 4  ఆగస్టు నుంచి మొదలవనుందని అంటున్నారు. మరి ఈలోపు కరోనా తో సమస్యలు రాకపోతే అనుకున్నట్టు సీజన్ మొదలవుతుంది. లేదంటే ఇక ఈసారికి బిగ్ బాస్ కష్టమే. 

మరింత సమాచారం తెలుసుకోండి: