మిల్కీ బ్యూటి తమన్నా భాటియా ఇండస్ట్రీకొచ్చి ఇంతకాలం అవుతున్నా తరగని అందంతో తళ తళ మెరుస్తూనే ఉంది. ఊహించని అవకాశాలు అందుకుంటూనే ఉంది. అంతేకాదు తనకోసమే అన్నట్టు కొన్ని సినిమాల కోసం మేకర్స్ తమన్నానే ఏరీ కోరి తీసుకుంటున్నారు. బాహుబలి ఫ్రాంఛైజీ తర్వాత సైరా లో అద్భుతమైన పాత్ర చేసింది. చెప్పాలంటే తెలుగులో తమన్నాకి ఈ రెండు సినిమాలో అవకాశం రావడం గొప్ప విషయం. ఒకవైపు పాన్ ఇండియా సినిమాలు చేస్తూనే మరో కమర్షియల్ ఎంటర్‌టైనర్స్ లో కూడా గ్లామరస్ పాత్రలు చేస్తోంది.

 

IHG's character in Chiranjeevi's 'Sye ...

 

ప్రస్తుతం యాక్షన్ హీరో గోపీచంద్ నటిస్తున్న సీటీమార్ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. సంపత్ నంది ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక దర్శకుడు సంపత్ నందితో తమన్నా కి ఈ సినిమా హ్యాట్రిక్ సినిమా. సంపత్ నంది గతంలో మెగా పవర్ స్టార్ రాం చరణ్ తమన్నాలతో రచ్చ సినిమా తీసి హిట్ కొట్టాడు. ఆ తర్వాత రవితేజ తో బెంగాల్ టైగర్ తీశాడు. ఈ సినిమాలో తమన్నా ఒక హీరోయిన్ గా నటించగా ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు మరోసారి ఈ దర్శకుడితో తమన్నా హ్యాట్రిక్ హిట్ కోసం ట్రై చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో తమన్నా కబడ్డీ కోచ్ గా కనిపించబోతుంది.

 

IHG

 

ఇలా సీనియర్ హీరోలతో నటిస్తున్న తమన్న మొదటిసారి ఒక యంగ్ హీరో ఇంకా చెప్పాలంటే స్టార్ కాని హీరో పక్కన నటించబోతుందని తాజా సమాచారం. జ్యోతి లక్ష్మీ సినిమాతో టాలీవుడ్ లో గుర్తింపు పొందాడు సత్య దేవ్. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేశాడు. అయితే గత సంవత్సరం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ లో సెకండ్ లీడ్ లో నటించాడు. ఈ సినిమా సత్య దేవ్ కి బాగా ఉపయోగపడింది. ఇక రీసెంట్ గా ఈ యంగ్ హీరో నటించిన 47 డేస్ ఓటీటీలో రిలీజై మంచి పేరు తెచ్చుకుంది. 

 

IHG'Love Mocktail' <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=TELUGU' target='_blank' title='telugu-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>telugu</a> remake


దాంతో ఒక కన్నడ సూపర్ హిట్ సినిమాలో హీరోగా నటించే అవకాశం రాగా ఆ సినిమాలో సత్య దేవ్ కి తమన్నా జంటగా నటిస్తుంది. నిజంగా తమన్నాసినిమా ఒప్పుకొని అందరికీ షాకిచ్చింది. ఇక సత్య దేవ్ హీరోగా నటించిన మరో సినిమా ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య ఈ రోజు నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. కేరాఫ్ కంచర పాలెం దర్శకుడు వెంకట్ మహా మలయాళ హిట్ మహేసింతే ప్రతీకారం కి రీమేక్  ఈ సినిమాని తెరకెక్కించాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: