పేరుకు కర్ణాటక సంగీత కచ్చేరి ఇచ్చి మమ అనిపించుకోవడం ఆయనకు ఇష్టం లేదు. అందుకని, ఆరు నెలల పాటు కర్ణాటక సంగీతం నేర్చుకుని పోయేలోపు కచ్చేరి ఇవ్వాలని అనుకున్నారు. ,ప్రముఖ సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఓ అవకాశం కూడా ఇచ్చారు. “నా దగ్గరకు రా. ఆరు నెలల్లో అన్నీ నేర్పుతా’ అని చెప్పార్ట. ఆరు నెలలు ఖాళీ చేసుకుని వెళ్ళడం బాలుకి అప్పట్లో సాధ్యపడలేదు. రోజుకు కనీసం రెండు పాటలు అయినా పాడేవారు. ఇక, ఖాళీ ఎక్కడ వుంటుంది చెప్పండి?ఒకసారి తిరువయ్యారులో త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో పాడటానికి రమ్మని ఎస్పీ బాలుకి ఆహ్వానం వచ్చింది. కర్ణాటక సంగీత కచ్చేరి ఇవ్వమని పిలిచారు. వాళ్ళు ధైర్యం చేశారు కాని బాలు చెయ్యలేకపోయారు. తండ్రి కోరికతో పాటు తన ఆశయం, లక్ష్యం కూడా తీరకుండా బాలు వెళ్ళిపోయారు.
ఇక ఆయన మరణం పై ప్రముఖ నటులు ఇంకా ప్రేక్షక దేవుళ్ళు సోషల్ మీడియా వేదికగా ఆయన గొప్ప తనాన్ని వర్ణిస్తూ, ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి