జయమ్మ అలియాస్ వరలక్ష్మి. క్రాక్ సినిమా తర్వాత సౌత్ ఇండియా అంతటా వరలక్ష్మీ పేరు జయమ్మ గా పాపులర్ అయింది. ఇందులో ఆమె ఎంతో అద్భుతంగా నటించి,ప్రేక్షకులలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. ఏదైనా ఒక సినిమా రిలీజ్ అయితే, అందరూ హీరో హీరోయిన్ల గురించి మాట్లాడుకుంటారు. కానీ ట్రాక్ సినిమాలో మాత్రం విలన్ జయమ్మ గురించి మాట్లాడుకోవడం గమనార్హం. అంతగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి, ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసింది వరలక్ష్మి. ఇదిలా ఉండగా త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతోంది జయమ్మ.

ఇక పెళ్లిపీటలు ఎక్కబోతోంది అన్న విషయం వినగానే అందరికీ మదిలో మెదిలే వరుడు స్టార్ హీరో విశాల్. ఆ  పేరు వినబడడానికి  గల కారణం హీరో విశాల్ జయమ్మ ఎన్నో సంవత్సరాలుగా ప్రేమలో పడ్డట్టు అందరికీ తెలుసు. ఆ కారణం చేతనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని అందరూ అనుకుంటున్న నేపథ్యంలో ఎవరూ ఊహించని విధంగా షాక్ ఇచ్చారు జయమ్మ తండ్రి శరత్ కుమార్.


అగ్ర నటుడు, సీనియర్ యాక్టర్ అయిన శరత్ కుమార్ పెద్ద కూతురు వరలక్ష్మి. గతంలో  శరత్ కుమార్ విశాల్ తండ్రి మంచి స్నేహితులు. ఇక వీరివురి  స్నేహం కారణంగానే   విశాల్,వరలక్ష్మీ లు ప్రేమలో పడ్డానికి  కారణం అయ్యింది. అయితే రీసెంట్ గా శరత్ కుమార్ కు విశాల్ కు మధ్య జరిగిన గొడవల కారణంగా ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. అయితే చాలా కాలం తర్వాత ఆమె పెళ్లికి సంబంధించిన వార్తలు వస్తున్నాయి. ఇంక ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్లే అని కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఈ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇక ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో కూడా ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

35 సంవత్సరాల వయస్సు ఉన్న వరలక్ష్మీ  శరత్ కుమార్,ఒక క్రికెటర్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు కథనాలు వస్తున్నాయి. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని గతంలో అయితే పెళ్లి విషయం పై ఏవైనా వార్తలు వినిపిస్తే, వెంటనే స్పందించే జయమ్మ. ఇప్పుడు మాత్రం ఎలాంటి స్పందన ఇవ్వడం లేదు. ఇక జయమ్మ పెళ్లి విషయం ఆమె మాటల్లోనే వినడానికి మనం మరికొంత కాలం ఎదురు చూడక తప్పదు.



మరింత సమాచారం తెలుసుకోండి: