మోనాల్ గురించి మాట్లాడాలంటే బిగ్ బాస్ కి ముందు అలాగే బిగ్ బాస్ కి తరువాత అని మాట్లాడాలి. బిగ్ బాస్ కి ముందు మోనాల్ గురించి పెద్దగా ఎవరికీ తెలీదు. కేవలం అతికొద్ది మందికి మాత్రమే తెలుసు. మోనాల్ తెలుగులో నాలుగైదు సినిమాలు నటించినా అల్లరి నరేష్ కు జోడిగానే అందరికీ సుపరిచితం. బిగ్ బాస్ తరువాత మోనాల్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

మోనాల్ ని ఇదివరకటి కంటే ఎక్కువ మంది గుర్తిస్తున్నారు. బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే మొదటగా ఆఫర్ల వర్షం కురిసింది మోనాల్ కే. బిగ్ బాస్ లో టిష్యూస్ ను ఎక్కువగా వినియోగించుకున్న మోనాల్ బయటికి వచ్చాక బ్యూటిఫుల్ స్మైల్ తో సందడి చేస్తోంది.

ఇదిలా ఉంటే, మోనాల్ ను తెలుగులోకి పరిచయం చేసిన అల్లరి నరేష్ ప్రస్తుతం "బంగారు బుల్లోడు" చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా అనేది నగల స్కామ్ చుట్టూ తిరుగుతోందని తెలుస్తోంది. బ్యాంక్ లో పనిచేసే అల్లరి నరేష్ తమ బ్యాంక్ లాకర్ లో భద్రపరచిన నగల విషయంలో చిక్కుల్లో పడతాడు. ఈ సమస్య నుంచి బయటకు ఎలా వస్తాడు అన్నదే కథనమని అర్థమౌతోంది.  

ఇదిలా ఉంటే, మోనాల్ గజ్జర్...."సుడిగాడు" చిత్రం ద్వారా తెలుగు ఆడియెన్స్ కు దగ్గరైన గుజరాతీ భామ. అల్లరి నరేష్ సరసన నటించి తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఇది తమిళంలో హిట్టైన యాక్షన్ పేరడీ మూవీకు తెలుగు రీమేక్.

ప్రస్తుతం నరేష్ అలాగే మోనాల్ వార్తల్లో ఉన్నారు. వీరిద్దరూ మళ్ళీ జోడీ కడితే బాగుంటుందని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. "సుడిగాడు" టైమ్ లో మోనాల్ బాగా నాజూగ్గా ఉంది. ఇప్పుడు, మోనాల్ స్వీటీ అనుష్కలా తయారైంది. మన టాలీవుడ్ కి మరో అనుష్క దొరికిందని టాక్ నడుస్తోంది.

అటు యువహీరోలు అలాగే ఇటు సీనియర్ హీరోస్ కు ఇలా అందరికీ మోనాల్ బాగా సూట్ అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: