నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రానికి సంబంధించిన ప్రస్తావన వచ్చిన ప్రతీ సారి..అది సంచలనంగా మారుతోంది..ఇక తాజాగా ఎన్టీఆర్ వర్ధంతి రోజు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రస్తావన వచ్చినప్పుడు నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కీలకంగా మారాయి..ఎన్టీఆర్ ని ఉద్దేశించి బాలయ్య.." ఎప్పటికైన మావాడు ఇక్కడకి రావాల్సిందే కదా అని తన సన్నిహితుల దగ్గర బాలయ్య వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం". అయితే ఇప్పుడు ఈ మాటలే హాట్ టాఫిక్ గా మారాయి. దీంతో మళ్లీ ఫోకస్ జూనియర్ ఎన్టీఆర్ పైకి వెళ్లిందంటున్నారు పార్టీలో కొందరు కీలక నేతలు. ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా చంద్రబాబు, బాలయ్య మద్య గ్యాప్ కూడా బాగా పెరిగిందని..

 ఈ గ్యాప్ ఎన్టీఆర్ ను బాలయ్య దగ్గర తీసుకోవాడానికి పనికొస్తోందంటున్నారు పార్టీ లో కొందరు కీలక నేతల అభిప్రాయం.పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి బాలకృష్ణ అడిగితే బాబు పొలిట్ బ్యూరో తో సరిపెట్టడంపై బాలయ్య గత కొద్ది రోజులుగా గరం గరంగా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీయే మా నాన్నది అయినప్పుడు మధ్యలో బాబు పెత్తనమేంటనే భావనలో బాలయ్య ఉన్నట్లు అతని సన్నిహితుల సమాచారం.మరోవైపు ఎప్పుడు పార్టీకి తన అవసరం వచ్చిన తాను వెళ్లి సేవాలందించడానికి రెడీగా ఉన్నానని ఏనాడో స్పష్టం చేశాడు ఎన్టీఆర్. అయితే ఆయన సేవాలను చంద్రబాబు, లోకేష్ ఇప్పుడున్న పరిస్థితిల్లో తీసుకుంటారా అనేదే చర్చనీయాంశమైంది.

టీడీపీలో అయితే చంద్రబాబు తరువాత పార్టీని అంత సమర్ధవంతంగా నడిపే నాయకుడు కనిపించడం లేదు. లోకేష్ ఉన్పప్పటికి పార్టీలో క్రీయాశీలక నేతగా ఎదిగారే కాని పార్టీలో కీలక నేత కాలేకపోయారు. గత ఎన్నికల్లో మంగళగిరిలో ఓటమి కూడా లోకేష్ సమర్ధతపై అనుమానాలను పెంచింది. ఈ సమయంలో మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ పోలిటికల్ ఎంట్రీపై చర్చ ఆసక్తికరంగా మారింది. ఈ సారి కూడా ఇది చర్చకు మాత్రమే పరిమితమవుతుందా లేకా ఆ దిశగా ఏమైన అడుగులు పడతాయా అనేది చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: