ఇప్పుడున్న టాలీవుడ్ అగ్ర హీర్లోలల్లో ఎన్టీఆర్ ఒకరు, దాదాపు రెండు దశాబ్దాలుగా హీరోగా సినిమాలు చేస్తున్న ఈ నందమూరి కుర్రాడి కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయ్, గోరంగా ప్లాప్ అయినా సినిమాలు కూడా ఉన్నాయ్.. అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తన 30 వ సినిమా ని త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి చేస్తూ ఉండడం తో, ఇప్పటి వరకు ఎన్టీఆర్ చేసిన అని సినిమాలల్లో ఏది బెస్ట్ సినిమా అని వోటింగ్ పెట్టగా అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఎన్టీఆర్ ఏడవ సినిమా అయినా సింహాద్రి కి ప్రేక్షుకులు ఎక్కువ ఓట్లు వేశారు, మరి ఈ పోలింగ్ లో ఏ ఏ సినిమాలకి ఎన్ని ఓట్లు పడ్డాయో ఇపుడు తెలుసుకుందాం..

తారక్, రాజమౌళి కంబినేషన్లో వచ్చిన మొదటి చిత్రం స్టూడెంట్ నెంబర్.1 కి 243 ఓట్లు పోలవ్వగా మొత్తం వోటింగ్ లో ఈ సినిమా కేవలం 3.05 శాతం ఓట్లను మాత్రమే దకించుకుంది.. వి. వి. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఆది చిత్రం 1246(15.65 శాతం) ఓట్లను దకించుకోగా, రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన రెండవ సినిమా సింహాద్రి 2648 (33.25 శాతం) ఓట్లను సాధించి మొదటి స్థానంలో నిలిచింది.. ఇక వీరి కాంబినేషన్ లో వచ్చిన యమదొంగ 253(3.18 శాతం) ఓట్లను దక్కించుకుంది.

ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేసి అదరకొట్టిన అదుర్స్ 625 (7.85 శాతం) ఓట్లు, పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన  టెంపర్ 1178 (14.79 శాతం) ఓట్లు, సుకుమార్ దర్శకత్వం లో వచ్చిన నాన్నకు ప్రేమతో 590 (7.41 శాతం) ఓట్లను దక్కించుకోగా..
కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమాకి 528 (6.63 శాతం) ఓట్లు పోలయ్యాయి. ఎన్టీఆర్ తన కెరీర్ లో మొదటి సారి ట్రిపుల్ రోల్ లో నటించిన జై  లవకుశ 208(2.61 శాతం) ఓట్లను దక్కించుకోగా.. హరీష్ శంకర్ దర్శకత్వం లో వచ్చిన అరవింద సమేత 444(5.58 శాతం) ఓట్లను దక్కించుకుంది.

మొత్తం ఇప్పటి వరకు ఎన్టీఆర్ తీసిన అని సినిమాలకి కలిపి 7963 ఓట్లు నమోదవ్వగా అందులో అత్యధికంగా ప్రేక్షకులు సింహాద్రి సినిమాకి ఓటు వేశారు, యాక్షన్, కామెడీ, రొమాన్స్ ఇలా అని ఎలిమెంట్స్ తో కూడిన ఈ కమర్షియల్ బ్లాక్ బస్టర్ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో ది బెస్ట్ సినిమా అంటూ ఆన్లైన్ వోటింగ్ లో ప్రేక్షకులు నిర్ధారించారు.. అయితే ఎన్టీఆర్ రామ్ చరణ్ తో కలిసి చేస్తున్న rrr సినిమా ఈ రికార్డ్స్ అని బద్దలు కొడుతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు..

మరింత సమాచారం తెలుసుకోండి: