మెగాస్టార్ సినిమాకి ప్రేక్షుకుల్లో ఎంత క్రేజ్ ఉంటుందో వేరేగా చెప్పక్కర్లేదు, తాను వేసే స్టెప్పుల దగ్గరి నుండి చెప్పే ప్రతి డైలాగుకి థియేటర్లో విజిల్స్ ఏ విజిల్స్, అంతే కాకుండా తమ అభిమాన హీరో నెక్స్ట్ సినిమాల్లో నటించే హీరోయిన్ ఎవ్వరు అంటూ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుండి చిత్ర బృందం హీరోయిన్ పేరుని ప్రకటించే వరకు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు, కొరటాల శివ దర్శకత్వంలో చిరు ఆచార్య సినిమా చేస్తున్న సంగతి మనందరికి తెలిసిందే, అయితేే ఈ సినిమా తర్వాత చిరంజీవి లూసిఫర్ సినిమా రీమేక్ లో నటించబోతున్నాడు..

హనుమాన్ జంక్షన్ సినిమా తో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయిన డైరెక్టర్ మోహన్ రాజాసినిమా ని డైరెక్ట్  చేయబోతుయన్నాడు, రీమేక్ సినిమాలు చేయడం లో ఇతను స్పెషలిస్ట్, అయితే వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న లూసిఫర్ సినిమా రీమేక్ లో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు అనే విషయం తెలుసుకోవడానికి మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, మలయాళం లూసిఫర్ సినిమాలో మంజు వారియర్ పోషించిన ఈ పాత్రని తెలుగు లో ఎవరు పోషించబోతున్నారు..?

చిరు పక్కన ఈ పాత్ర పోషించడానికి డైరెక్టర్ మోహన్ రాజా నయనతారని సంప్రదించినట్టు తెలుసుంది, అయితే నయనతారసినిమా లో చేయడానికి అటు ఎస్ కానీ ఇటు నో కానీ చెప్పలేదట, ఇందుకు కారణం ప్రస్తుతం నయనతార తన బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ ని పెళ్లి చేసుకోబోతుంది అని అందుకే తాను ఈ సినిమాకి ఇంకా ఎటువంటి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి, మరి నయనతారని ఒప్పించి ఈ సినిమాలో నటించేలా చేస్తారో లేదా, తనని రీప్లేస్ చేసి మరో హీరోయిన్ తో అయినా ఈ సినిమా ని చేస్తారో తెలియాలి అంటే సినిమా విడుదల అయ్యేవరకు వేచి చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: