తెలుగు లో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న సినిమాలు అన్నీ వేరే భాషల్లో విడుదల కావడం సహజం..అక్కడ డబ్ చేసి విడుదలైన సినిమాలకు మంచి ఆదరణ కూడా ఉంటుంది. ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న సినిమా బాహుబలి.. ఈ సినిమా ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా విడుదల అయ్యింది. జక్కన్న చేసిన జిమ్మిక్కులు అక్కడ నచ్చడంతో ఆయా ప్రభుత్వాలు పిలిచి మరి ఘన సత్కారం చేశారు. ఆ స్థాయిలో ఇప్పటివరకు ఏ ఒక్క సినిమా రాలేదని చెప్పాలి.



ఇకపోతే ఈ  ఏడాది సంక్రాంతికి విడుదల అయిన రెండు సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో పాటుగా భారీ కలెక్షన్స్ ను కూడా రాబట్టాయి..`సరిలేరు నీకెవ్వరు`, `అల వైకుంఠపురములో..` చిత్రాలు రెండూ సూపర్‌హిట్లుగా నిలిచాయి. ఆ తర్వాత నెలలో విడుదలైన `భీష్మ` కూడా విజయవంతమైంది. అదే జోరు కొనసాగుతుందనుకున్న సమయంలో కరోనా వచ్చి అందరి ఆశల పై నీళ్లు చల్లింది. సినిమాల మాట పక్కన పెట్టేసి ప్రాణాలను కాపాడుకొనే పనిలో పడ్డారు.. దాంతో మార్చి నుంచి సెప్టెంబర్ సినిమాలు ఎక్కడిక్కడ ఆగిపోయాయి. విడుదల కావలసిన సినిమాలు కూడా దుకాణ్ సర్దేశాయి.


ఇటీవల కాలంలో లాక్ డౌన్ లో సడలింపులు చేయడంతో సినీ ఇండస్ట్రీలో సీనియాల జోరు హోరెత్తిస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో మాత్రం థియేటర్లు ఇంకా ఓపెన్ కాలేదు కానీ, కర్ణాటక , చెన్నైల లో సినిమా హాళ్లు ఓపెన్ అయ్యాయి.చెన్నైలో థియేటర్లు ప్రారంభం కాగానే `సరిలేరు నీకెవ్వరు` సినిమాను తొలుత ప్రదర్శించనున్నారు. ఇక బెంగళూరులో `అల వైకుంఠపురములో..`, `భీష్మ` చిత్రాలను పలు థియేటర్లలో విడుదల చేస్తున్నారు. టాలీవుడ్ లో సంక్రాంతికి పోటీపడ్డ ఈ సినిమాలు ఇప్పుడు కూడా మరోసారి బరిలోకి దిగాయి. ఏ సినిమా ఏ మాత్రం హిట్ టాక్ ను అందుకుంటుందో చూడాలి.. ఇప్పుడు మరో మారు పోటీ పడటం తో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: