గండిపేటలో అల్లు స్టుడియోస్ పేరుతో కొత్తగా నిర్మాణం మొదలు పెట్టారు అల్లు అరవింద్ కుటుంబ సభ్యులు. ఈ అల్లు స్టుడియోస్ శంకుస్థాపన కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ పూర్తిగా దూరంగా ఉంది. అప్పుడే అసలు అల్లు-మెగా కుటుంబాల మధ్య ఏదో జరుగుతోందనే ఊహాగానాలు వెలువడ్డాయి. తాజాగా వీటికి బలం చేకూరుస్తూ.. మెగా ఫ్యామిలీ కూడా ఫ్లోర్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టిందనే వార్తలొస్తున్నాయి. అల్లు స్టుడియోస్ తో మెగా ఫ్యామిలికీ సంబంధం ఎలా ఉండదో.. మెగా ఫ్యామిలీ నిర్మించే ఫ్లోర్ల విషయంలో కూడా అల్లు ఫ్యామిలీకి అస్సలు సంబంధం ఉండదు.
అసలు చిరంజీవి 150వ సినిమాని అల్లు అరవింద్ తన నిర్మాణంలోనే మొదలు పెట్టాలనుకున్నారు. కానీ అంతలోనే.. రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ స్థాపించడం, గీతా ఆర్ట్స్ ని పక్కనపెట్టడంతో వ్యవహారంలో తేడా వచ్చింది. అప్పటి నుంచి రెండు ఫ్యామిలీల మధ్య ఏదో జరుగుతోందనే పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా అల్లు స్టుడియోస్ విషయంలో అది బహిర్గతమైంది. ఇక దాని వెంటనే మెగా ఫ్యామిలీ కూడా స్టూడియో టైప్ లో ఫ్లోర్ల నిర్మాణానికి సిద్ధమవుతుందనే విషయం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది. ఒకే బిజినెస్ లో ఉన్న రెండు కుటుంబాలు.. ఇలా విడివిడిగా ఎవరి ప్రయత్నాలు వారు చేయడం అంటే కాస్త విచిత్రమే మరి.

చిరంజీవికి గతంలో స్టూడియో నిర్మించాలనే ఆలోచన ఉంది. అయితే దాన్ని పక్కనపెట్టి ఆయన ఫ్లోర్ల నిర్మాణం వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. రామానాయుడు స్టూడియోస్ లో ప్రస్తుతం షూటింగ్ లు తక్కువగానే జరుగుతున్నాయి. మరోవైపు టీవీల్లో గేమ్ షోలు విపరీతంగా పెరిగడంతో.. చిన్న చిన్న ఫ్లోర్ల అవసరం పెరిగింది. రామోజీ ఫిలిం సిటీలో అవసరమైనన్ని ఫ్లోర్లు షూటింగ్ లకు అనుకూలంగా ఉన్నా.. అది నగరానికి బాగా దూరం కావడంతో.. దగ్గర్లోనే ఫ్లోర్లు అందుబాటులో ఉంటే బాగుంటుందని కొంతమంది అభిప్రాయ పడుతున్నారు. అందుకే మాల్, మల్టీప్లెక్స్ కడదామనే ఆలోచనతో ఉన్న అల్లు అరవింద్ ఫ్లోర్ల నిర్మాణం ప్రారంభించారు. ఇప్పుడు ఇదే ఆలోచనతో మెగాస్టార్ చిరంజీవి కూడా మూడు నాలుగు ఫ్లోర్లను నిర్మించబోతున్నారట. బావా బావమరుదులు ఈ వ్యాపారంలో పోటీకి దిగుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: