ఆరెక్స్ 100 సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలిచింది పాయల్ రాజ్ పుత్. ఎక్కడో బాలీవుడ్ సీరియల్స్ చేసుకుంటున్న ఈ భామని తెచ్చి అదిరిపోయే సినిమా చేశాడు అజయ్ భూపతి. తను రాసుకున్న కథకు పర్ఫెక్ట్ గా సూటయ్యేలా రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ ఎంపిక జరిగింది. సినిమాలో అటు అందంతో అలరిస్తూ హాట్ షోస్ తో రెచ్చిపోయిన పాయల్ ఒక్క సినిమాకే పది సినిమాల క్రేజ్ సంపాదించింది. అయితే అదే క్రమంలో వరుస సినిమలైతే చేస్తుంది కాని ఆశించిన స్థాయిలో వర్క్ అవుట్ అవ్వట్లేదు.

ఆర్డిఎక్స్ లవ్, సీత సినిమాలో స్పెషల్ సాంగ్ లాంటివి చేసినా ఆశించిన స్థాయిలో ఆడలేదు. వెంకీమామ సినిమాలో నటించి హిట్ అందుకున్నా ఆమె కెరియర్ కు యూజ్ అవలేదు. రవితేజ డిస్కో రాజాలో కూడా మూగ అమ్మాయి పాత్రలో నటించిన పాయల్ ఆ సినిమాతో కూడా హిట్ దక్కించుకోలేదు. అందుకే మళ్ళీ తన పాత పంథాలో ఓ మాంచి మసాలా సినిమా చేయాలని భావిస్తుందట. అలాంటి ఊపొచ్చే సినిమా చేస్తేనే కాని అమ్మడు మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేలా లేదని తెలుస్తుంది.

పాయల్ రాజ్ పుత్ తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆరెక్స్ 100 లాంటి సినిమాలే మరో రెండు పడితే మాత్రం అమ్మడికిక తిరుగు ఉండదు. కథల ఎంపిక విషయంలో పాయల్ చేస్తున్న తప్పులే ఆమె కెరియర్ గ్రాఫ్ ను పడిపోయేలా చేస్తున్నాయి. ప్రస్తుతం ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్న పాయల్ ఆ తర్వాత వెబ్ సీరీస్ లో కూడా నటిస్తుందని తెలుస్తుంది.                                                         

మరింత సమాచారం తెలుసుకోండి: