రాజమౌళి డైరక్షన్ లో ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి నటిస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్. ఎనౌన్స్ మెంట్ తోనే సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. బాహుబలి తర్వాత చిన్న సినిమా చేయాలనుకున్న రాజమౌళి అంతకుమించి సినిమాను లైన్ లో పెట్టాడు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రాం చరణ్.. కొమరం భీం పాత్రలో ఎన్.టి.ఆర్ నటిస్తున్నారు. ఇద్దరు కలిసి చేసే హంగామా ఓ రేంజ్ లో ఉంటుందని తెలుస్తుంది.

ఇక ఇప్పటికే అల్లూరి సీతారామరాజు టీజర్ తో మెప్పించిన రాజమౌళి ఇప్పుడు కొమరం భీమ్ టీజర్ కు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆల్రెడీ రష్ రెడీ అవగా టీజర్ ఫైనల్ కట్ ప్రాసెస్ లో ఉందట. ఎన్.టి.ఆర్ కొమరం భీం టీజర్ ఆర్.ఆర్.ఆర్ పై మరింత అంచనాలు పెంచేలా చేస్తుందని అంటున్నారు. అల్లూరిగా చరణ్.. కొమరం భీమ్ గా తారక్ ఇద్దరు తమ నట విశ్వరూపం చూపించేలా ఉన్నారని తెలుస్తుంది.  

ముఖ్యంగా ఈ సినిమాను బాలీవుడ్ లో కూడా రిలీజ్ ప్లాన్ చేశారు కాబట్టి చరణ్, తారక్ ల నట ఉగ్ర రూపం ఏంటన్నది ఈ సినిమాతో తెలుస్తుంది. ఆర్.ఆర్.ఆర్ సినిమాను డివివి దానయ్య 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సినిమాతో మరోసారి తెలుగు సినిమా సత్తా ఏంటన్నది చూపించాలని ఫిక్స్ అయ్యాడు రాజమౌళి. తప్పకుండా ఆర్.ఆర్.ఆర్ మరోసారి బాహుబలి కాదు అంతకుమించి రికార్డులను సృష్టిస్తుందని చెప్పొచ్చు. ఈ సినిమాలో అజయ్ దేవగన్, అలియా భట్, ఒలివియా మోరిస్ లు నటిస్తున్నారని తెలిసిందే.                                                              

మరింత సమాచారం తెలుసుకోండి: