పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీల్ అత్త నదియా  గురించి తెలియని వారు ఉండరు. ఆమె మంచి నటి.  గతం లో తెలుగు, తమిళ భాషల్లో కూడా ఎన్నో సినిమాలు చేసింది నదియా.  కానీ ఈ భామ కి అనేక సినిమాలలో  పెద్దగా  గుర్తింపు రాక పోయినా..... అత్తారింటికి దారేది కి వచ్చింది. ఆమె నటించిన అన్ని సినిమాలు ఒక ఎత్తైతే....  అత్తారింటికి దారేది మరొక ఎత్తు అనే అనాలి. పవన్ అత్త పాత్ర చేస్తే వచ్చిన ఆ క్రేజే వేరు. అలానే నదియా  ప్రభాస్‌కు మిర్చిలో తల్లిగా కూడా నటించారు. వెంకటేష్ దృశ్యం సినిమా లో తల్లిగా కూడా  నటించి మెప్పించింది.

ఇలా ఇప్పటి సినిమాల్లో కూడా నదియా నటించి ఎంత గానో గుర్తింపు పొందుతున్నారు. ఈ వయస్సు లో కూడా ఆమె యాక్టింగ్ తో పోటీ ఇస్తున్నారంటే ఎంత ట్యాలెంట్ ఓ అర్ధం చేసుకోవచ్చు.  ఈమె వయస్సు ఎంతో తెలుసా...?  53 సంవత్సరాలు. షాక్ అయ్యారా...! నదియా కి శిరీష్ గాడ్ బోలే అనే వ్యక్తి తో వివాహం జరిగింది. నదియాకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. చూడడానికి ఇద్దరు కూతుర్లు కూడా తల్లి నదియా లాగే ఉంటారు.

వారి వివరాల్లోకి వెళితే..... వీరిలో ఒకరి పేరు సనమ్‌, మరొకరి పేరు జానా. నదియా కూతుర్లు ఇద్దరు కూడా  సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారంటే తల్లికి పోటీ ఇస్తారనడం లో ఏ మాత్రం సందేహం లేదు. ప్రస్తుతం నదియా నటించిన సినిమాలు రిలీజ్ కావాల్సి వుంది. నదియా తన అందమైన ఇద్దరి కూతుర్లని సినిమా ల్లోకి తీసుకు వస్తుందో లేదో మరి మనం చూడాలి. నిజంగా ఈ అందమైన భామలు కనుక సినిమా లోకి వస్తే తన తల్లి లాగే పాపులర్ అవుతారనడం లో ఏ మాత్రం సందేహం లేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: