సీనియర్ హీరోలకు అతి పెద్ద సమస్య ఏంటి అంటే హీరోయిన్లు దొరకకపోవడమే.  వారి సినిమాకు డైరెక్టర్లు ఉన్నారు. డబ్బులు పెట్టే నిర్మాతలు ఉన్నారు. అందరు టెక్నీషియన్స్ ఉన్నారు. కానీ అసలైన గ్లామర్ మాత్రం దక్కడంలేదు. హీరోయిన్స్ మాత్రం స్వీట్  సిక్స్ టీ  హీరోల పక్కన నటించేందుకు నో ఎందుకో నో అంటున్నారు. పైగా ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉండడంతో నటిస్తే కనుక తన కెరీర్ అక్కడితో ఆగిపోతుందని భయపడుతున్నారు. దాంతో టాప్ సీనియర్లు అంతా హీరోయిన్ల సెర్చింగ్ లోనే ఉన్నారు.

ఇక బాలక్రిష్ణ, బోయపాటి హ్యాట్రిక్ మూవీకి హీరోయిన్ సమస్య అలాగే ఉంది. ఒక షెడ్యూల్ షూటింగ్ చేశారు. ఇక కరోనా వచ్చి ఏడు నెలలు అయింది. మెల్లగా రెండవ షెడ్యూల్ ని సెట్స్ మీదకు తేవాలని బోయపాటి చూస్తున్నాడుట. అయితే  హీరోయిన్ సమస్యే తలనొప్పిగా మారిందని అంటున్నారు. ముంబై మోడల్స్ ని అనుకున్నారు. అదే విధంగా చాలా మంది హీరోయిన్ల పేరు కూడా వినిపించింది కానీ  ఏదీ వర్కౌట్ అయినట్లుగా లేదు.

ఇపుడు ఒక కొత్త పేరు మాత్రం వినిపిస్తోంది. అదే ప్రగ్యా మార్టిన్. ఈ అమ్మడు మలయాళ కుట్టి. ఆమె పిశాచి అని తెలుగు డబ్బింగ్   సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. మలయాళంలో ఆమె సినిమాలు ఏం చేస్తుందో తెలియదు కానీ పిశాచి ద్వారా టాలీవుడ్ కి పరిచయం అయిన ఫేస్ గా ఉంది. ఇక ఆమెను బాలయ్య పక్కన నటింపచేయాలని బోయపాటి చూస్తున్నాడు అంటున్నారు. మరి ఆమె ఓకే అంటే మాత్రం బాలయ్యకు హీరోయిన్ల కొరత తీరినట్లే మరి చూడాలి దసరా రోజున సినిమాకు సంబంధించి అన్ని విషయాలూ చెబుతాను అని బోయపాటి అంటున్నారు. దానికోసం బాలయ్య ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. ఏది ఏమైనా ఈ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని బోయపాటి బాలయ్య డిసైడ్ అయ్యారు. దాంతో కసిగా పనిచేస్తున్నారు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: