భారతదేశంలో హీరోయిన్ దీపికా పడుకుని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటన, అభినయం, అందం తో భారతదేశంలో ఎంతో మందిని తన ఫాన్స్ గా మార్చుకున్న వ్యక్తి దీపిక పడుకొనే. ఇకపోతే ఈవిడ మన తెలుగు హీరోల కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే వ్యక్తి. దీపికా పడుకొనే ఒక్క సినిమాకి ఏకంగా 30 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అంటే ఆమె రేంజ్ ఏంటో ఇట్లే అర్థం చేసుకోవచ్చు. అసలు విషయంలోకి వెళితే... అంత డబ్బు సంపాదించే ఆవిడ ఉపాధి హామీ పనికి వెళుతుందట. వినడానికి ఈ విషయం చాలా విడ్డూరంగా ఉన్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకున్న సంఘటన చూస్తే నమ్మక తప్పదు.


మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ చోద్యం చోటుచేసుకుంది. కేవలం దీపికా పడుకొనే కాదు.. మరో హీరోయిన్ జక్విలన్ కూడా ఉపాధి హామీ పనులకు హాజరు అవుతుందట. ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వారి ఇద్దరి ఫోటోలు ఉన్న ఉపాధి హామీ జాబ్ కార్డు కనిపించడమే ఇందుకు నిదర్శనం. ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఫోటోలను నెటిజన్స్ సోషల్ మీడియా లో చూసి అవాక్కవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉపాధి హామీ పథకాన్ని ఇలా అధికారులు చేయడం ఎంతవరకు కరెక్టో అధికారులే ఆలోచించుకోవాలి.


బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ ఇలా  ఉండడం చూసి నిజంగా ఆశ్చర్య పడాల్సిన విషయం. ఇక సంబంధించి మధ్యప్రదేశ్  రాష్ట్రంలోని జిర్క్య జిల్లా పిపర్ ఖేడ నకా పంచాయతీలో ఉన్న సర్పంచ్, కార్యదర్శి కలిసి బాలీవుడ్ హీరోయిన్ల ఫోటోలతో పథకం లబ్ధిదారుల నకిలీ జాబ్ కార్డులను సృష్టించి వారు సొమ్ము చేసుకుంటున్న విషయం తేలింది. వీరిద్దరి పేర్లపై ఏకంగా 30 వేల రూపాయలను డ్రా చేసుకున్నట్లు అధికారులు తేల్చారు. ఈ సంఘటనకు సంబంధించి జిల్లా పంచాయతీ సీఈఓ తాజాగా విచారణకు ఆదేశించారు.




మరింత సమాచారం తెలుసుకోండి: