సినిమా షూటింగ్స్ ప్రారంభమైనా కొందరు నటులు తొందపడటం లేదు. మరికొందరు షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. అయితే.. ఇప్పటికీ అందరిలో కరోనా భయం వెంటాడుతూనే ఉంది. ఇందుకు తగ్గట్టే స్టార్ హీరోయిన్ తమన్నా ఆమధ్య షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చి కరోనా బారిన పడింది. ఇక్కడే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న తమన్నా కోలుకుంది. స్వస్థలం ముంబై కూడా వెళ్లిపోయింది. అయితే.. ఇప్పుడు తమన్నా మళ్లీ షూటింగ్స్ లో పాల్గొనేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి వర్కౌట్స్ స్టార్ట్ చేసింది. ఆ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అయింది.

తన ఇంటి డాబాపై చల్లని వాతావరణంలో.. ఓపెన్ ఎయిర్ లో వర్కౌట్స్ ప్రారంభించింది. కరోనా సోకి తగ్గిన తర్వాత తమన్నా కనిపించడం ఇదే తొలిసారి. తమన్నా అందంలో ఏ మార్పూ లేకపోయినా కాస్త బొద్దుగా తయారయింది. దీంతో కాస్త సన్నబడేందుకు కసరత్తులు చేస్తోంది. ‘కరోనా వైరస్ తగ్గిన తర్వాత నా తొలి అడుగులు పడుతున్నాయి. మళ్లీ నా స్టామినా తిరిగి పొందడం ముఖ్యం. శరీరం మాట వినాల్సిందే. అందుకే వర్కౌట్స్ స్టార్ట్ చేశాను’ అంటూ తన వాల్ లో రాసుకుంది. తమన్నా వర్కౌట్స్ కు మరో స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్ స్పందించింది. ‘గుడ్ గర్ల్’ అంటూ కామెంట్ చేసింది.

ఈ వీడియోలో తమన్నా పలు ఎక్సర్ సైజులు చేసింది. ఏకంగా మూడు నిమిషాలకు పైగా ఉన్న వీడియోలో చాలా యాక్టివ్ గా కనిపించింది. ప్రస్తుతం తమన్నా తెలుగులో పలు సినిమాలతో బిజీగా ఉంది. గోపీచంద్ తో ‘సీటీమార్’ సినిమా చేస్తోంది. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నాడు. సినిమాలో తెలంగాణ కబడ్డీ కోచ్ గా నటిస్తోంది. వీటితోపాటు సత్యదేవ్ తో గుర్తుందా శీతాకాలం, నితిన్ తో అందాదూన్ రీమేక్ లో కూడా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: