టాలీవుడ్ లో స్టార్ హీరోలు ఇప్పుడు సినిమాల విషయంలో కాస్త ప్రత్యేకంగా శ్రద్ధ పెడుతున్న సంగతి తెలిసిందే. కొంతమంది స్టార్ హీరోల సినిమాలను కాస్త సీరియస్ గా తీసుకుని ముందుకు అడుగులు వేస్తున్నారు. అగ్ర హీరోల సినిమాల విషయంలో నిర్మాతలు కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో స్టార్ హీరోలు కూడా కాస్త ఎక్కువగానే జాగ్రత్త పడుతున్నారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా విషయంలో కాస్త ఎక్కువగా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ప్రయోగం చేసే ఆలోచనలో ఉన్నాడని వార్తలు వచ్చాయి.

కానీ ఈ సినిమా విషయంలో మాత్రం అతను వెనక్కి తగ్గాడు అని అంటున్నారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ మాత్రం అంతగా ఆసక్తి చూపించడం లేదని అంటున్నారు. కథలో కొన్ని మార్పులు చేయాలని త్రివిక్రమ్ శ్రీనివాస్ కి చెప్పినట్లుగా సమాచారం. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఈ కధ విషయంలో చాలా వరకు జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కథల విషయంలో చాలా వరకు జాగ్రత్తగా ఉండేవారు. అయితే ఆయనకు అజ్ఞాతవాసి సినిమా తర్వాత కొన్ని షాక్ లు తగిలాయి.

కథలో పట్టు లేకపోవడంతో ఆ సినిమా ఘోరంగా ఫ్లాప్ అయింది. ఇప్పుడు ఈ సినిమా విషయంలో అతను కాస్త ఎక్కువగా దృష్టి పెడుతున్నాడు. ఇక ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది ఏంటి అనేది తెలియదు. కానీ షూటింగ్ మాత్రం దాదాపుగా జనవరిలో మొదలయ్యే అవకాశాలు ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో నడిచే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి క్లారిటీ కూడా లేదు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: