ఒకప్పుడు హీరోయిన్స్ అంటే కేవలం డ్యాన్స్ లకి, కొన్ని రొమాంటిక్ సీన్లకి పరిమితం అయ్యేవారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ వారికి కూడా మంచి మంచి పాత్రలు పడుతుండడంతో వారికీ కూడా మంచి రోజులు వచ్చాయని చెప్పచ్చు. హీరోలతో సమానంగా ఫ్యాన్స్ ఏర్పడుతున్నారు. ఒకప్పుడు తమిళనాడు వరకే పరిమితం అయిన ఈ హీరోయిన్ ఫ్యానిజం ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని అంతటా విస్తరించింది. ఇప్పుడు ఫ్యాన్స్ అంతా తమ తమ హీరోల పుట్టిన రోజులని సోషల్ మీడియా ట్రెండ్స్ పేరిట జరుపుతున్నారు.

చిన్న చిన్న హీరోల మొదలు సూపర్ స్టార్స్ మొదలు అందరికీ ఫ్యాన్స్ ఇలానే విషెస్ చెబుతున్నారు. ఇప్పుడు కీర్తి సురేష్ పుట్టిన రోజుకు కూడా అలానే ఫిక్స్ చేసినట్టు చెబుతున్నారు. నిజానికి కీర్తి సురేష్ పుట్టిన రోజు 17 అక్టోబర్, అంటే ఈరోజు కానీ సుమారు రెండు నెలలు క్రితమే ఆమె ఫ్యాన్స్ అడ్వాన్స్ బర్త్ డే ట్రెండ్ చేశారు. అలాంటి వాళ్ళు ఇవాళ ఆగుతారా మరి. ఈరోజు కూడా గట్టిగానే ట్రెండ్ చేస్తున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే కీర్తి ఇప్పటికే మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి లాంటి సినిమాలు చేసింది. ఇవన్నీ రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. ఇక ఆమె నితిన్ తో రంగ్ దే అనే సినిమా చేస్తోంది. ఈ సినిమా షూట్ కొంత మేరకు బాకీ ఉంది. అలానే మహేష్ సరసన సర్కారు వారి పాట అనే సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమా కరోనా కారణంగా ఇంకా సెట్స్ మీదకే వెళ్ళలేదు. చూడాలి ఈరోజు ఆయా టీమ్స్ నుండి ఏమయినా అప్డేట్స్ వస్తాయేమో ?

మరింత సమాచారం తెలుసుకోండి: