ప్రముఖ తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ శుక్రవారం తన పుట్టినరోజు వేడుకలును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ మేరకు ‘మహానటి’ ఫేమ్ కీర్తిసురేశ్ అనిరుధ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపి సర్ ప్రైజ్ ఇచ్చింది. శుక్రవారంతో అనిరుధ్ రామచందర్ 30 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు.

అయితే కీర్తి సురేశ్ శుక్రవారం ట్విట్టర్ లో అనిరుధ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ లో ఇలా మాట్లాడుతూ.. ‘‘ ప్రియమైన అనిరుధ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు. వచ్చే ఏడాది నీకంతా కలిసి రావాలి. మరికొద్ది గంటల తర్వాత నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపు.’’ అంటూ పేర్కొంది. కాగా శుక్రవారం జరిగిన పార్టీలో వీరిద్దరూ మునిగితేలారు. ఈ సందర్భంగా వీరిద్దరూ దిగిన ఫోటోలను కీర్తిసురేశ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.



అనిరుధ్ ఇప్పటివరకూ తెలుగు, మళయాలీ, హిందీ, కన్నడలో పాటలు పాడారు. త్రీ, డేవిడ్, రఘువరన్ బీటెక్, కత్తి, మారి, నేను రౌడీనే, ఆవేశం, రెమో, మంత్రి గారి బంగ్లా, వివేకం, అజ్ఞాతవాసి, గ్యాంగ్, పేట, గ్యాంగ్ లీడర్, దర్బార్ వంటి సినిమాలో పాటలను అందించారు. ప్రస్తుతం ‘మాస్టర్’ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

ఇండస్ట్రీకి బాల్యనటిగా పరిచయమైన నటి కీర్తిసురేశ్ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో నేను శైలజ అనే చిత్రంతో పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘నేను లోకల్, అజ్ఞాతవాసి, మహానటి, పెంగ్విన్ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ‘మిస్ ఇండియా, గుడ్ లక్ సఖీ, మరక్కర్, రంగ్ దే, అన్నాత్తే, సాని కాయిధమ్ వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. కాగా ఈ రోజు (శనివారం) నటి కీర్తి సురేశ్ పుట్టినరోజు వేడుకలు జరుపుకోనున్నారు. ఈ పుట్టిన రోజుతో 28వ పడిలోకి అడుగు పెడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: