బుల్లితెరపై టాప్ రెట్టింగ్ తో దూసుకెళ్తున్న షో బిగ్ బాస్. ఈ షో తెలుగు ప్రేక్షకుల నుండి కూడా మంచి ప్రజాదరణ పొందుతుంది. అయితే 40వ రోజు బిగ్ బాస్ అమ్మాయిలకు పార్టీ చేసుకునే అవకాశం కల్పించాడు. ఇక ఈ ఎపిసోడ్ లో అమ్మాయిలు అబ్బాయిలా ప్రవర్తించారు. ఇక వీరి ముందు అభిజిత్‌, అమ్మ రాజశేఖర్‌, సోహైల్‌, అఖిల్‌ అమ్మాయిలుగా ప్రవర్తించారు. అయితే అందుకు అభిజిత్‌ భిన్నంగా వ్యవహరించారు.

అభిజిత్‌ బిగ్‌బాస్ ‌4 హౌజ్‌లో రొమాంటిక్ పర్సన్. ఇక అఖిల్ తో క్లాషెస్‌ రావడంతో అభిజిత్‌ మోనాల్‌కి దూరమయ్యేలా చేసింది. ఇక అప్పటి నుండి అభిజిత్‌ ఒంటరివాడైయ్యాడు. ఇక అతను హరికకు లైనేస్తున్నట్టు పలు సందర్భాల్లో పరోక్షంగా అర్ధం అవుతుంది. అయితే అభిజిత్ ని మాత్రం అరియానా బాగా ఇష్టపడుతుంది. అభిజిత్‌ టాపిక్‌ వచ్చిన ప్రతిసారి అరియానా విచిత్రంగా, ఎగ్జైటింగ్‌గా ప్రవర్తిస్తుంది. తాజాగా మరోసారి వీరిద్దరి మధ్య రహస్య రొమాన్స్ బయటపడింది.

ఇక 40వ రోజు అమ్మాయిలు పార్టీ చేసుకునే అవకాశం కల్పించారు బిగ్ బాస్. అయితే మొదటగా ఈ అమ్మాయిల పార్టీ క్లబ్‌కి వెళ్ళిన అభిజిత్‌ వారి అందాలను పొగిడాడు. అంతేకాదు అరియానా అందంగా ఉందని, బ్యూటీఫుల్‌ అని చెప్పాడు. అంతటితో ఆగకుండా హారిక అమేజింగ్‌ అని, గార్జియస్‌గా ఉన్నవని అన్నాడు. లాస్యని చాలా బాగా కనిపిస్తున్నావని ప్రశంసలు కురిపించాడు అభిజిత్. దివి గురించి ఏం చెప్పను అంటూ ఆమెకి బిస్కెట్‌ వేశాడు. ఈ క్రమంలో అరియానా డేట్‌కి వెళ్లాల్సి వస్తే ఎవరితో వెళ్తావని ప్రశ్నించింది. అందుకు అభిజిత్ నీతోనే అని అరియానాకి బదులిచ్చారు. అందుకు ఆరియానా ఒక్కసారిగా ఎగిరి గంతేయడమేకాదు, అభిజిత్‌కి థ్యాంక్స్ చెప్పడం విశేషంగా మారింది. ఇక అనంతరం అభిజిత్ ‌తో స్టెప్పులు వేయించారు. అయితే మొత్తంగా అరియానా, అభిజిత్‌ మధ్య సీక్రెట్‌గా ఏదో జరుగుతుందని మరోసారి స్పష్టమైందని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: