బాలీవుడ్ లో ఎంతోమంది అందమైన నాయికలు ఉన్నా ఎవరి అందం వారిదే. అదే కోవలోకి వస్తుంది మన నల్లకలువ బిపాసాబసు. కెరీర్ ఆరంభంలో తన బోల్డ్ యాక్టింగ్ తో కుర్రకారు మదిలో నిలిచిపోయింది. తరువాత కొన్ని హారర్ సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. బాలీవుడ్ లో ఈమె నడిపిన ప్రేమాయణం ఒక పెద్ద సంచలనం అయింది.  అప్పట్లో తన సహచర నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ తో కొంతకాలం డేటింగ్ చేసి 2016 లో వీరి ప్రేమకు వివాహంతో పుల్ స్టాప్ పెట్టింది. చివరిగా తాను నటించిన ఎలోన్ మూవీలో దెయ్యం పాత్రలో నటించి మెప్పించింది. దాదాపు అయిదు సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటోంది. తన భర్తతో కలిసి టీవీ ప్రొడక్షన్ సహా సినిమాలు నిర్మించే పనిలో ఉంది. కాగా ఈమె ప్రేక్షకులకు దగ్గరగా ఇంస్టా వేదికగా టచ్ లోనే ఉండడం గమనించాల్సిన విషయం.  

బిపాసా పెళ్లైనా కూడా  ఫిట్ నెస్ విషయంలో కేర్ తీసుకుంటూ ఇప్పటికీ అదే హాట్ నెస్ తో రచ్చ లేపుతోంది. తాజాగా నెటిజన్స్ కోసం సోషల్ మీడియా ఇన్ స్టా వేదికగా బిపాష షేర్ చేసిన పిక్స్ కి ఆమె అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఈ లుక్ తో పాటు ఓ ఆసక్తికరమైన పోస్ట్ ని షేర్ చేసింది. `మిమ్మల్ని మీరు ఘాడంగా ప్రేమించండి. హనెస్టీగా విశ్వాసంతో వుండండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఓ సూపర్ పవర్. మిమ్మల్ని మీరు ఎప్పుడైతే నమ్మడం మొదలుపెడతారో అప్పడే మ్యాజిక్ మొదలవుతుంది. ` అంటూ షేర్ చేసింది.

పెళ్లై దాదాపు ఐదేళ్లవుతున్నా బిపాసా అందంలో ఏ మాత్రం వన్నె తగ్గలేదు. అదే హాట్ నెస్ కనిపిస్తోంది. ప్రస్తుతం భర్త కరణ్ సింగ్ గ్రోవర్తో కలిసి వెబ్ సిరీస్ లో నటించింది. `డేంజరస్` పేరుతో రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ డిజిటల్ ప్లాట్ ఫామ్ ఎమ్ ఎక్స్ ప్లేయర్ లో ఆగస్టులో విడుదలైంది. బిపాసా బసు ఇంతకుముందు మహేష్ సరసన టక్కరి దొంగ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: