ప్రభాస్ ఆదిపురుష్ మూవీ గురించి చేసిన ప్రకటన ఎంతటి సంచలనం అయిందో అందరికీ తెలిసిందే. రాముడుగా ప్రభాస్ అన్న న్యూసే ఒక సెన్సేషన్. ఇక అదీ  పాన్ ఇండియా లెవెల్లో మూవీ., టీ సిరీస్ వారి నిర్మాణం. భారీ బడ్జెట్. టాప్ రేంజి టెక్నీషియన్స్. ఇలా ప్రతీదీ ఒక హంగామా హడావుడిగానే కనిపిస్తోంది. ఈ మూవీ విషయంలో వస్తున్న ప్రతి అప్ డేట్ గురించి ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు అంతా చెవులు  కళ్ళు అప్పగించి మరీ  ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. మొత్తానికి ఈ మూవీ గురించి వచ్చిన ప్రకటనే ఇంతలా ఊపేస్తే ఇక సినిమా రిలీజ్ అయితే ఎలా ఉంటుందో అన్నది ఎవరు మటుకు వారు  ఊహించుకోవాల్సిందే.

ఇదిలా ఉంటే రాముడుగా ప్రభాస్ ఓకే. రావణాసురుడిగా సైఫ్ ఆలీఖాన్ కూడా ఓకే. ఇతర పాత్రలకు కూడా నటులను తీసుకుంటున్నారు. కానీ అతి ముఖ్యమైన సీత పాత్ర కోసం మాత్రం ఎవరినీ ఇప్పటిదాకా సెలెక్ట్ చేయలేదు. అలా అనేకంటే సరైన నటి ఈ పాత్రకు కుదరలేదు అనుకోవడం బెటర్. మరి సీతగా ఉండాలంటే అందంతో పాటు అభినయం కూడా చాలా ముఖ్యం. ఇక పౌరాణిక పాత్రలు అంటే ఆ ఫేస్ సరిగ్గా నప్పాలి. దాని కోసం చాలా చాలా పెద్ద ఎత్తున ఆదిపురుష్ టీం సెర్చింగ్ చేస్తోంది.

మొత్తానికి ఎన్నో పేర్లు ప్రచారంలోకి వచ్చిన మీదట ఒక అమ్మడుని అనుకుంటున్నారుట. ఇది కూడా పూర్తిగా కన్ ఫర్మ్ అవునో కాదో తెలియదు కానీ అపుడెపుడో మహేష్ తో  తెలుగులో వన్ నేనొక్కడినే అన్న మూవీలో హీరోయిన్ గా చేసిన కృతి సనన్ ని ఈ మూవీ కోసం తీసుకుంటున్నారని టాక్ మాత్రం బయటకు వచ్చింది. ఈ అమ్మడు అయితే ఈ మూవీకి తగిన న్యాయం చేస్తాని చిత్ర డైరెక్టర్ ఓం రౌత్ భావిస్తున్నారుట.

మహేష్ సినిమా తెలుగులో పెద్దగా ఆడకపోయినా కృతి సనన్  కి బాలీవుడ్ బంగారు బాటనే పరచిందింట. దాంతో ఆమె టాప్ లెవెల్లోనే రాణిస్తున్నారుట. దాంతో ఆమెని ఫిక్స్ చేస్తూ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా మొత్తం సినిమా అప్ డేట్స్ అన్నీ మీడియా ముఖంగా వెలువరించాలని ఆదిపురుష్ టీం ఆలోచిస్తోందిట. సో అంతవరకూ ఆగితే సీత ఎవరో తేలిపోతుందిగా.

మరింత సమాచారం తెలుసుకోండి: