ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... బిగ్ బాస్ సీజన్ 4, రోజు  రోజు కి చాలా ఆసక్తికరంగా సాగుతుంది. అలకలు, గొడవలు, నామినేషన్ లతో చాలా ఇంట్రెస్టింగ్ గా వుంది. ‘జనతా గ్యారేజీ’లో నో మోర్‌ పార్టీస్‌… అంటూ ఎన్టీఆర్‌ ఓ వార్నింగ్‌ ఇస్తాడు గుర్తుందా? శుక్రవారం బిగ్‌బాస్‌ ఎపిసోడ్‌ చూశాక… ప్రేక్షకులు కూడా అదే మాట అంటున్నారు. ఎందుకంటే ఇంట్లో వినోదం అందిస్తారని అందరూ బిగ్‌బాస్‌ చూస్తుంటారు. నిన్నటి ఎపిసోడ్‌ చూస్తే ఎందుకు ఆ టాస్క్‌ పెట్టారో అర్థం కాలేదు.

గాళ్స్‌ నైట్‌ అవుట్‌ పేరుతో శుక్రవారం రాత్రి బిగ్‌బాస్‌ ఇంట్లోని రిఫ్రెస్‌ ఏరియాలో ఓ పార్టీ పెట్టాడు. ఇంట్లో ఉన్న అమ్మాయిలు అందంగా ముస్తాబై అందులోకి వచ్చారు. చిప్స్‌ తింటూ, డ్రింక్స్‌ తాగుకుంటూ, డ్యాన్స్‌లు వేసుకుంటూ సరదాగా గడిపారు. అక్కడివరకు బాగుంది. ఆ తర్వాత ఇంట్లో ఉన్న అబ్బాయిల్ని పిలిచి ముచ్చట్లు పెట్టారు. వాళ్లతో ఏవేవే సరదా పనులు చేయించుకున్నారు.

అభిజీత్‌తో అమ్మాయిలు చేసిన ఒపీనియన్‌ కాన్సెప్ట్‌ కాస్త బాగున్నా… మిగిలినవి సోసోగా సాగాయి. అయినా మంచి టాస్క్‌ ఇచ్చి ప్రేక్షకుల్ని అలరించకుండా ఈ పార్టీలు ఏంటో అర్థం కావడం లేదు. అమ్మ రాజశేఖర్‌, సోహైల్‌ కాసేపు నవ్వించినా… పెద్దగా వినోదం కనిపించలేదు. ఆఖర్లో అఖిల్‌ అయితే చిరాకు పుట్టించాడు. ఇంకా మిగిలిన అబ్బాలు కూడా ఆ గదిలోకి వచ్చినట్లున్నారు కానీ. బై గాడ్స్‌ గ్రేస్‌ అవి మనకు చూపించలేదు. మొత్తానికి నిన్న పార్టీ ఎపిసోడ్ ని ఆడియన్స్ ని అంతగా ఆకట్టుకోలేకపోయింది.


ఇక ఈ వారం నామినేషన్ లో అభిజిత్, నోయెల్, అఖిల్, హారిక, మోనాల్, దివి, అరియానా, కుమార్ సాయి మరియు లాస్య ఎలిమినేట్ అవ్వటానికి సిద్ధంగా వున్నారు. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి..

మరింత సమాచారం తెలుసుకోండి: